గజని, అల్లు అర్జున్ తో చేస్తే ఎలా ఉంటుంది!
ఈ మధ్యన బాలీవుడ్ లో లాగా టాలీవుడ్ లోనూ మల్టీ స్టార్ సినిమాలు చేయుటకు సముఖత చూపిస్తున్నారు. ఆమద్యన చిరంజీవి, శ్రీకాంత్ నటించిన మల్టీ స్టార్ చిత్రం 'శంకర్ దాదా యంబిబియస్", 'శంకర్ దాదా జిందాబాద్" హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కమల్ హాసన్, వెంకీ నటించిన మల్టీస్టార్ చిత్రం 'ఈనాడు" ఆవరేజ్ టాక్ కూడా తెచ్చుకోకుండా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడింది. మరైతే మల్టీస్టార్ మూవీస్ బాలీవుడ్ లో హిట్ అయినంతగా టాలీవుడ్ లో హిట్ కాకపోవడానికి కారణం దర్శకత్వ మహిమ లేక ప్రేక్షకాదరన కరువైందా అన్నతరుణంలో...
మళ్ళీ నేనున్నానంటూ అల్లు అర్జున్ మల్టీస్టారర్ సినిమాలు చేసి తన అదష్టాన్ని పరీక్షించుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్, మంచు మనోజ్ కుమార్ కాంబినేషన్ లో 'వేదం" సినిమా చేస్తున్న సంగతి తెలిసందే. తాజాగా రామ్ చరణ్ తో కలసి సినిమా చేస్తానని ప్రకటించాడు. ఇదిలలా ఉంటే 'గజని" సూర్య, అల్లు అర్జున్ లు కలిసి ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఓ ప్రముఖ దర్శకుడు ఇచ్చిన స్ర్కిప్ట్ కు అల్లు అర్జున్, సూర్య అయితే బాగుంటారని అల్లు అరవింద్ భావిస్తున్నాడట.
ఈ స్ర్కిఫ్ట్ తో సూర్యను అప్రోచ్ అవ్వగా అతను కూడా సుముఖంగానే స్పందించాడని తెలుస్తోంది. త్వరలోనే డేట్స్ అడ్జెస్ట్ చేస్తానని కూడా చెప్పాడట. అల్లు అర్జున్, సూర్యలకు సౌత్ లో మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆంధ్రా, తమిళనాడు, కేరళ, కర్నాటకలో ఈ సినిమా విడుదల చేస్తారని సమాచారం.


Click it and Unblock the Notifications











