గీతా ఆర్ట్స్ పై యాభై లక్షల డామేజ్ కేసు

ఇక ఈ విషయమే ఆ లాయర్ మీడియాతో మాట్లాడుతూ..నా క్లయింట్ అసలే బ్లడ్ ఫ్రెషర్ తో భాధపడుతున్నాడు. అలాంటి వ్యక్తికి అనవసరమైన కాల్స్ తో ఇబ్బంది పడాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ఇంతకు ముందు వేరే వ్యక్తికి ఇలాంటి సంఘటనే జరిగినప్పుడు అయినా జాగ్రత్త పడి ఉండాల్సింది. ఏ నెంబర్ పబ్లిసిటీలో ఇస్తున్నామో వెరిఫై చేసుకుని ఉండాల్సింది. అలా చేయనందువల్లే నా క్లయింట్ కి రకరకాల కాల్స్ ,మెసేజెస్ వస్తున్నాయి. ఆయన తన బిజినెస్ ని ఈ టెన్షన్ లో పడి లాస్ చేసుకున్నారు. అంతేగాక అన్ని కాల్స్ లో పనికొచ్చేవి ఏవో తెలియక ఎత్తలేక పోయారు. దాంతో అతని రిప్యుటేషన్ ,గుడ్ విల్ పోయాయి. దీనికంతటికీ కారణం నిర్మాతల నిర్లక్ష్య ధోరణే. అంటూ ఫైర్ అయ్యారు.


Click it and Unblock the Notifications











