For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Varun Tejతో విభేదాలు..అందుకే సినిమా ఆగిపోయింది: అసలు మేటర్ లీక్ చేసి షాకిచ్చిన డైరెక్టర్

  |

  టాలీవుడ్‌లో ఎక్కువ సక్సెస్ రేటు ఉన్న హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచే భారీ సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకుంటోన్న అతడు.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను అందుకున్నాడు. అప్పటి నుంచి జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇక, ఈ మధ్య వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే మరో భారీ చిత్రం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరుణ్ డైరెక్టర్‌తో గొడవ పడ్డాడని, సినిమా ఆగిపోయిందని ప్రచారం జరుగుతోంది. దీనిపై సదరు దర్శకుడు స్పందించాడు. ఆ వివరాలు మీకోసం!

  సాయంత్రం వేళలో శ్రీదేవి కూతురు షికారు.. అలా బయటకు ఖుషి కపూర్ షాక్

   అలా మొదలైన కెరీర్.. జాతీయ అవార్డు

  అలా మొదలైన కెరీర్.. జాతీయ అవార్డు

  శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ‘ముకుంద' అనే సినిమాతో తెలుగు చిత్ర సీమకు హీరోగా పరిచయం అయ్యాడు వరుణ్ తేజ్. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. కానీ, నటుడిగా అతడికి మంచి పేరును తెచ్చింది. అయితే, ఆ తర్వాత వచ్చిన ‘కంచె'తో మొదటి విజయాన్ని అందుకున్నాడు వరుణ్. అంతేకాదు, ఈ మూవీకి జాతీయ అవార్డు కూడా దక్కింది.

   వరుస విజయాలతో మెగా ప్రిన్స్ హవా

  వరుస విజయాలతో మెగా ప్రిన్స్ హవా

  కెరీర్ మధ్యలో కొన్ని నిరాశ పరిచిన చిత్రాలు దక్కించుకున్నప్పటికీ.. ఎక్కువ శాతం విజయాలనే అందుకున్నాడు వరుణ్ తేజ్. ఇక, ఈ మధ్య కాలంలో అతడు నటించిన ‘ఫిదా', ‘తొలిప్రేమ', ‘ఎఫ్2', ‘గద్దలకొండ గణేష్' వంటి సినిమాలు ఘన విజయాలను అందుకున్నాయి. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో రెమ్యూనరేషన్ పెంచేశాడు.

  ఆ సినిమాకు సీక్వెల్‌లో నటిస్తున్నాడు

  ఆ సినిమాకు సీక్వెల్‌లో నటిస్తున్నాడు

  వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘ఎఫ్2'కు సీక్వెల్‌గా వస్తున్న ‘ఎఫ్3'లో నటిస్తోన్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో వెంకటేష్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. తమన్నా భాటియా, మెహ్రీన్ హీరోయిన్లు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పాత్రను బాగా హైటైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

  బాక్సర్‌గా మారిపోయిన వరుణ్ తేజ్

  బాక్సర్‌గా మారిపోయిన వరుణ్ తేజ్

  ప్రస్తుతం వరుణ్ తేజ్ మరో సినిమాలోనూ నటిస్తున్నాడు. అదే బాక్సింగ్ నేపథ్యంతో వస్తున్న ‘గని'. కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సయూ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర విలన్‌గా చేస్తున్నాడు.

  దర్శకుడితో వరుణ్‌ విభేదాలు.. స్టాప్

  దర్శకుడితో వరుణ్‌ విభేదాలు.. స్టాప్

  ‘గని' సినిమా దర్శకుడు కిరణ్ కొర్రపాటితో వరుణ్ తేజ్ గొడవ పడ్డాడని రెండు మూడు రోజులుగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. సినిమా తీస్తున్న విధానం నచ్చకపోవడం వల్లే వీళ్లిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ కారణంగానే ‘గని' మూవీని ఆపేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మెగా అభిమానులు అయోమయం అవుతున్నారు.

  అసలు మేటర్ చెప్పి షాకిచ్చిన డైరెక్టర్

  అసలు మేటర్ చెప్పి షాకిచ్చిన డైరెక్టర్

  ‘గని' వివాదంపై దర్శకుడు కిరణ్ కొర్రపాటి తాజాగా స్పందించారు. ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడిన ఆయన సినిమా గురించి, వరుణ్ తేజ్‌తో విభేదాల గురించి స్పష్టత ఇచ్చారు. ‘వరుణ్ తేజ్‌తో విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. అంతేకాదు, ఇప్పటి వరకూ వచ్చిన ఔట్‌పుట్ పట్ల ఆయన సంతోషంగా ఉన్నారు. అవాస్తవాలను ఎవరూ నమ్మకండి' అంటూ చెప్పుకొచ్చారు.

   సినిమా ఆగిపోవడానికి కారణం అదే

  సినిమా ఆగిపోవడానికి కారణం అదే

  ప్రస్తుతం ‘గని' మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీని వెనుక కారణాన్ని వివరిస్తూ.. ‘నాతో పాటు నా కుటుంబం మొత్తం కరోనాతో ఇబ్బందులు పడుతున్నాం. అందుకే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీని నుంచి కోలుకున్న వెంటనే పని మొదలు పెడతాను. ఈ సినిమా కోసం ఎప్పుడు పని చేస్తానా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను' అంటూ వివరణ ఇచ్చారు కిరణ్ కొర్రపాటి.

  English summary
  In an Interview.. Ghani Movie Director Kiran Korrapati Clarified about Clash with Varun Tej. and also he said about movie stopped rumors are totally baseless.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X