నందమూరి హీరో రెస్టారెంట్ కూల్చివేత.. రాత్రి సమయంలో అలాంటి పనులు!

Recommended Video

GHMC Collapses Nandamuri Taraka Ratna Restaurant | నందమూరి హీరో రెస్టారెంట్ కూల్చివేసిన జీహెచ్ఎంసీ

హైదరాబాద్ నగరంలో పలు బార్ అండ్ రెస్టారెంట్స్ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నాయి. కానీ అధికారుల దృష్టికి వెళుతున్నవి కొన్ని మాత్రమే. ఆయా ప్రాంతాల ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా నందమూరి హీరో తారక రత్నకు చెందిన రెస్టారెంట్ ని జిహెచ్ఎంసి అధికారులు నేలమట్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

 అకస్మాత్తుగా

అకస్మాత్తుగా

సోమవారం రోజు జీహెచ్ఎంసీ అధికారులు అకస్మాత్తుగా తారక రత్నకు చెందిన రెస్టారెంట్ పై దాడులు నిర్వహించారు. ఈ రెస్టారెంట్ బంజారాహిల్స్ రోడ్ నెం 12 లో ఉంది. అధికారులు రెస్టారెంట్ మొత్తాన్ని కూల్చివేశారు. ఈ సమయంలో అధికారులకు, రెస్టారెంట్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీస్ బందోబస్తుతో వచ్చిన అధికారులు ఎవరి మాట వినకుండా వారి విధుల్ని నిర్వహించారు. రెస్టారెంట్ కూల్చివేతకు గురవుతోందని తెలియడంతో తారక రత్న హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.

 అక్రమంగా నడుపుతున్నారు

అక్రమంగా నడుపుతున్నారు


ఇది రెషిడెన్షియల్ ప్రాంతం అని ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ నడపడం నిబంధనలకు విరుద్ధం. అందుకే కూల్చేస్తున్నాం అని అధికారులు తారక రత్నకు తెలిపారు. ఈ సమయంలో తారక రత్న, ఓ మహిళా అధికారి మధ్య కూడా కాస్త వివాదం జరిగింది. కనీసం సామాగ్రినైనా తరలించేందుకు కొంత సమయం ఇవ్వాలని తారక రత్న కోరాడు. దీనితో అధికారులు 3 గంటల సమయం ఇచ్చారు.

 తాగుబోతుల న్యూసెన్స్

తాగుబోతుల న్యూసెన్స్

అర్థరాత్రి సమయంలో కూడా డీజే శబ్దాలు, తాగుబోతుల న్యూసెన్స్ ఎక్కువవుతోంది స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ మీరు రెస్టారెంట్ నడపడానికి వీల్లేదని ఓ అధికారిణి తారక రత్నకు తేల్చి చెప్పేసింది. ఈ రెస్టారెంట్ తనదే అని, లైసెన్స్ ఉందని, నిబంధనల ప్రకారమే తాను ఈ రెస్టారెంట్ నడుపుతున్నానని తారక రత్న అధికారులతో వాగ్వాదానికి దిగారు.

 నటనకు దూరంగా

నటనకు దూరంగా

2002లో తారక రత్న ఒకటో నెం కుర్రాడు చిత్రంతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ తారక రత్న హీరోగా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం తారక రత్న నటనకు దూరంగా ఉంటున్నాడు. నందమూరి మోహన్ కృష్ణ తనయుడే తారక రత్న. ప్రస్తుతం నందమూరి హీరోలలో బాలయ్య, జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే టాలీవుడ్ లో యాక్టివ్ గా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X