మెగా హీరో రాంచరణ్‌పై కేసు నమోదు

By Srikanya

హైదరాబాద్ : రాంచరణ్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బర్త్‌డే సందర్భంగా అనుమతిలేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు జీహెచ్ఎంసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రాంచరణ్‌పై, ఆయన అభిమానులైన స్వామి నాయుడు వంటి వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.ఎలక్షన్ కోడ్ అమలలో ఉండటంతో ఉల్లఘనకు పాల్పడినట్లైంది. అభిమానులు బ్లడ్ బ్యాంక్ దగ్గర అనుమతి లేకుండా పెట్టిన ఫ్లెక్సీలే ఈ కేసుకు కారణమని తెలుస్తోంది.

ప్రస్తుతం కృష్ణ వంశీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఫస్ట్ లుక్ ని పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసారు. ఈ చిత్రం షూటింగ్ లో రెగ్యులర్ గా రామ్ చరణ్ పాల్గొంటున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా ఓ కుటుంబ కథా చిత్రం తెరకెక్కుతోంది. కాజల్‌ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకుడు. బండ్ల గణేష్‌ నిర్మిస్తున్నారు. శ్రీకాంత్‌, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

GHMC Case filed on Ram Charan

నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ- ''కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు, తెలుగు సంప్రదాయాలు కలగలిపి తీర్చిదిద్దుకున్న కథ ఇది. సినిమాలో రామ్‌చరణ్‌ కొత్తగా కనిపిస్తాడు. శ్రీకాంత్‌ ఇందులో రామ్‌చరణ్‌కి యంగ్‌ బాబాయిగా కనిపిస్తారు. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయి. తమిళ నటుడు రాజ్‌కిరణ్‌ పాత్ర చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ''అన్నారు.

కృష్ణవంశీ మాట్లాడుతూ... తాను ప్రస్తుతం రామ్ చరణ్ తో 'మురారి' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసే పనిలో ఉన్నానని కృష్ణ వంశీ చెప్పుకొచ్చారు తండ్రిగా నాగార్జునని అడుగుతున్నారని తెలుస్తోంది. తాతగా రాజ్ కిరణ్ కనిపించనున్నాడు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు అన్నారు బండ్ల గణేష్. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X