RGVకి ‘పవర్ స్టార్’ షాక్.. జరిమానా కొరడా విదిలించిన జీహెచ్‌ఎంసీ

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మొదటి సారి జీహెచ్‌ఎంసీ జరిమానా విధించింది. ఇటీవల పవర్ స్టార్ సినిమాతో వర్మ ఏ రేంజ్ లో హడావుడి చేశారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. లాక్ డౌన్ తరువాత మొదటి పోస్టర్ అంటూ ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్ ని బహిరంగ ప్రదేశాల్లో అంటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై సీరియస్ అయిన జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెట్‌ సెల్‌ ఆయనకు జరిమానా విధించింది.

Recommended Video

GHMC Fine To Director Ram Gopal Varma Over Power Star Movie || Oneindia Telugu
సినిమాపై బజ్ క్రియేట్ చేయడానికి

సినిమాపై బజ్ క్రియేట్ చేయడానికి

పవర్ స్టార్ సినిమాను ఇటీవల విడుదల చేసిన వర్మ ఎన్నో కాంట్రవర్సీ లను ఎదుర్కొన్నారు. సినిమాపై బజ్ క్రియేట్ చేయడానికి అన్ని రకాల దారులను వాదుకున్నారు. ఆయన కార్యాలయంపై దాడి కూడా జరిగింది. ఆ వార్త అనంతరం వర్మ మీడియాలో ఒక్కసారిగా తన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశాడు.

 మొదటి పోస్టర్ పడింది..

మొదటి పోస్టర్ పడింది..

అసలు మ్యాటర్ లోకి వస్తే..లాక్ డౌన్ తరువాత డిజిటల్ వరల్డ్ రిలీజ్ అయ్యే సినిమాకు సంబంధించిన మొదటి పోస్టర్ పడింది అంటూ వర్మ ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని బహిరంగ ప్రదేశాల్లో అంటించిన ఆ పోస్టర్ సోషల్ మీడియాలో కూడా బాగానే వైరల్ అయ్యింది.

జరిమానా ఎంతంటే..

జరిమానా ఎంతంటే..

దీంతో ఆ పోస్టర్ పై ఒక నెటిజన్‌ సీఈసీ- ఈవీడీఎం ఖాతాకు జోడిస్తూ ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు ఈ నెల 22న జరిమానా విధించారు. రెండు పోస్టర్స్ అంటించారు గనక పోస్టర్ కి 2వేల రూపాయల చొప్పున మొత్తంగా నాలుగు వేల రూపాయల జరిమానా విధించారు. దీంతో ఈ న్యూస్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది.

ఆర్జీవి ఆఫీస్ కి జరిమానా చలనా

ఆర్జీవి ఆఫీస్ కి జరిమానా చలనా

త్వరలోనే ఆ జరిమానా చలానాను జూబ్లీహిల్స్‌, గాయత్రిహిల్స్‌లోని ఆర్‌జీవీ ఉంటున్న అడ్రస్ కు పంపించనున్నట్లు ఈవీడీఎం వర్గాలు తెలిపాయి. ఇక పవర్ స్టార్ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని చెబుతున్న ఆర్జీవి నెక్స్ట్ మర్డర్, థ్రిల్లర్ సినిమాలతో రాబోతున్నట్లు వివరణ ఇచ్చాడు. రీసెంట్ గా విడుదల చేసిన మర్డర్ సినిమా ట్రైలర్ ని విడుదల చేసిన వర్మ ఎప్పటిలానే సోషల్ మీడియాలో ప్రమోషన్స్ డోస్ పెంచుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X