twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వారస హీరోల వల్లే ఇబ్బందులు.. గిరిబాబు

    By Srikanya
    |

    కొంతమంది వారి వారసులనే నటులుగా పెట్టి సినిమాలు తీయడం, వారే ఎగ్జిబిట్ చేసుకోవడం వల్ల చిన్న నిర్మాతలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రముఖ సినీ నటుడు గిరిబాబు ఆవేదనతో వాఖ్యానించారు. పర్చూరు మండలంలోని బోడవాడ గ్రామంలో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొన్న గిరిబాబు కొద్దిసేపు మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుతం కొద్దిమంది చేతుల్లో బందీ అయ్యిపోయిందని,చిన్న నిర్మాతల సినిమాలకు థియేటర్లు కూడా దొరకడం లేదని గిరిబాబు అన్నారు. గతంలో సినిమాలు కథాంశం, హీరోల పాత్రల ప్రాధాన్యతతో నడిచేవని, అటువంటిది నేటి సినిమాల్లో కుటుంబ కథాంశం, ప్రేమసందేశం, సామాజిక దృక్పథం మచ్చుకైనా కానరావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాల్లో నేరప్రవృత్తిని ఎక్కువగా చూపిస్తుండడం బాధాకరమని ఆయన అన్నారు. ఇక ఇదే విషయాన్ని గత కొంత కాలంగా నట్టికుమార్ వంటి వారు అంటూనే వస్తున్నారు.

    పరిశ్రమ నలుగురు చేతుల్లో ఇరుక్కుపోయిందని ఎంతమంది అన్నా పట్టించుకునే వాళ్లు లేరు. ఎవరూ ఆ నలుగురు పెద్ద వాళ్ళని దాటే వాళ్శు లేకపోవటంతో పరిశ్రమలో మార్పు రావటం లేదు. అప్పుడప్పుడూ ఆ పరిస్ధితిని గమనించిన సీనియర్స్ ఇలా స్పందిచటం తప్ప ఏమీ చేయలేని పరిస్దితి నెలకొని ఉంది. ప్రస్తుతం గిరిబాబు పెద్దగా సినిమాల్లో కనపించటం లేదు. ఆయన కుమారుడు రఘుబాబు కమిడియెన్ గా ఎంట్రీ ఇచ్చిన దగ్గరనుండీ ఆయన ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. రఘుబాబు ఓ ప్రక్క నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలలోనూ, మరో ప్రక్క కామిడీని పండించే హాస్యగాడు పాత్రలలోనూ రాణిస్తున్నారు.

    English summary
    Character artist Giri Babu attended a marriage and comments on Telugu Films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X