twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవితో గొడవకు కారణం అదే.. నాపై అలా దెబ్బ కొట్టారు.. గిరిబాబు

    |

    మూడు తరాల నటులతో కలిసి నటించిన ఘనత ఉన్న నటుడు గిరిబాబు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. ఎన్నో అద్భుతంగా తెరకెక్కించారు. చివరిసారిగా గీత గోవిందం చిత్రంలో నటించి మెప్పించాడు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాలు వెల్లడించారు. చిరంజీవితో ఉన్న విభేదాలు గురించి వివరించారు. ఆయన ఏం చెప్పారంటే..

    ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ గురించి

    ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ గురించి

    ఈ తరం హీరోలలో ప్రభాస్, ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి హీరోలతో పనిచేయలేదు. కానీ విజయ దేవరకొండతో కలిసి నటించారు. ఎన్టీఆర్ సెట్లో చాలా సరదాగా ఉంటాడు. అందర్ని నవ్విస్తుంటాడు. విజయ్ దేవరకొండ చాలా మంచివాడు. అందరిని గౌరవిస్తుంటాడు. మర్యాదస్తుడు అని గిరిబాబు అన్నారు.

    మహేష్‌బాబుతో అనుబంధం గురించి

    మహేష్‌బాబుతో అనుబంధం గురించి

    మహేష్ బాబు చిన్నతనం నుంచి అందంగా, హుషారుగా ఉండేవారు. మహేష్ బాబుతో కలిసి చాలా సినిమాలు నటించాం. అన్నదమ్ముడు సినిమాలో గురువుగా నటించాను. కొడుకు దిద్దిన కాపురంలో డ్యూయల్ రోల్, శంఖారావం, పెద్దోడు అయ్యాక, హీరోగా చేసిన తర్వాత అతడులో నటించాను. మహేష్ బాబు అందరితో కలిసి పోతుంటాడు.

    చిరంజీవితో వ్యక్తిగత విభేదాలు

    చిరంజీవితో వ్యక్తిగత విభేదాలు

    చిరంజీవితో విభేదాల గురించి గిరిబాబు స్పందిస్తూ.. ఒకే సమయంలో నేను, చిరంజీవి కౌబాయ్ సినిమాలను రూపొందించాం. నేను ఇంద్రజిత్ సినిమా నిర్మిస్తే, చిరంజీవి హీరోగా కొదమసింహం సినిమాలను రూపొందించాం. తొలుత కొదమ సింహాన్ని తర్వాత రిలీజ్ చేస్తామని చెప్పారు. రెండు కౌబాయ్ సినిమాలు కావడంతో అనుకోకుండా మా సినిమా చూసి కొదమసింహం సినిమాను ముందుగా రిలీజ్ చేశారు.

     కొదమసింహం ఫ్లాప్ కావడంతో

    కొదమసింహం ఫ్లాప్ కావడంతో

    కొదమ సింహం అంతగా ప్రజాదరణ పొందకపోవడంతో ఇంద్రజిత్ సినిమాకు కష్టాలు ఎదురయ్యాయి. అంత పెద్ద స్టార్ హీరోగా రూపొందిన కొదమ సింహం సినిమా ఆడకపోవడంతో డిస్టిబ్యూటర్లు వెనుకడుగు వేశారు. సినిమా రిలీజ్‌ కొనడానికి ముందుకు ఎవరు రాలేదు.

    మాపై దెబ్బ అలా పడింది

    మాపై దెబ్బ అలా పడింది

    కొదమ సింహం ఎఫెక్ట్‌తో ఇంద్రజిత్‌ సినిమాను తక్కువ రేటుకు అమ్ముకొన్నారు. బయ్యర్లు తక్కువకు అడిగి అట్లా నా సినిమాను దెబ్బ కొట్టారు. కొద్దిరోజులపాటు మా మధ్య విభేదాలు ఉండేవి. ఆ తర్వాత మళ్లీ ఇద్దరం కలిసిపోయాం. సినిమా, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు అని అన్నారు.

     తుదిశ్వాస వరకు నటిస్తూనే ఉంటాను

    తుదిశ్వాస వరకు నటిస్తూనే ఉంటాను

    తుదిశ్వాస ఉండే వరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. నా కుమారుడు రఘుబాబు హాస్యనటుడిగా మంచి పేరు సంపాదించుకొన్నాడు. అందరు హీరోలతో నటిస్తున్నాడు. నా మనవడు హీరోగా పరిచయం కాబోతున్నాడు. నా మనవడి పేరు నాగరత్నం బాబు. నా తల్లి చనిపోయి చాలా రోజులైంది. అందుకే నా తల్లిపేరును అతడికి పెట్టుకొన్నాను అని అన్నారు.

    English summary
    Senior actor Giribabu is open about rift between Chiranjeevi. He said, Kodama Simham movie is made a gap between me and Chiru. His cowboy movie Indrajit was got heavy losses.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X