కోర్టుకు హాజరైన గిరీష్ కర్నాడ్
బెంగళూరు : జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, నటుడు గిరీష్ కర్నాడ్ ఇక్కడి 9వ ఏసీఎంఎం కోర్టు ముందు సోమవారం విచారణకు హాజరయ్యారు. ఆయన కథను సమకూర్చిన నాగమండల చిత్రంలో 'మాయదో మనద భార' పాటను తాను రచించిన కవితా సంకలనం నుంచి ఆయన తన అనుమతి లేకుండా వినియోగించుకున్నారని రచయిత గోపాల్ వాజ్‌పేయి కోర్టులో ఫిర్యాదు చేశారు.
విచారణకు గిరీష్ కర్నాడ్ గైర్హాజరయ్యారు. దీంతో గోపాల్ క్రిమినల్ కేసు నమోదు చేశారు. కోర్టు వారెంటు జారీ చేయటంతో గిరీష్ కర్నాడ్ విచారణకు హాజరయ్యారు. చిత్రంలో ఉపయోగించుకున్న పాటకు సంబంధించిన వివరాల్ని ఆయన కోర్టుకు అందించారు. ఈ రెండింటినీ పరిశీలించి విచారించి నిర్ణయం తీసుకోనున్నారు.



Click it and Unblock the Notifications











