twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ పరిశ్రమలో మరో విషాదం... ప్రముఖ నటుడు మృతి

    |

    Recommended Video

    Legendary Actor Girish Karnad Passed Away In His Bengaluru Residence || Filmibeat Telugu Today

    సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దక్షిణాది నటుడు గిరీష్ కర్నాడ్ మృతి చెందారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం బెంగుళూరులో కన్నుమూశారు.

    కన్నడ చిత్రం 'సంస్కార' ద్వారా 1970లో నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన తెలుగు, తమిళం, మళయాలం చిత్రాలతో పాటు అనేక హిందీ చిత్రాల్లో నటించారు. కర్నాడ్ నటించిన చివరి చిత్రం సల్మాన్ ఖాన్ హీరోగా 2017లో వచ్చిన 'టైగర్ జిందా హై'. ఇందులో RAW చీఫ్ పాత్రలో నటించారు.

    జ్ఞానపీఠ్, పద్మశ్రీ, పద్మ భూషణ్

    జ్ఞానపీఠ్, పద్మశ్రీ, పద్మ భూషణ్

    గిరీష్ కర్నాడ్ నటుడినే కాదు... సాహిత్య విభాగంలో అత్యున్నత ప్రభతిభ కనబరిచారు. సాహిత్యంలో భారత పౌరులకు అందించే అత్యున్నమైన ‘జ్ఞానపీఠ్' అవార్డ్ 1998లో దక్కించుకున్నారు. దీంతోపాటు 1974లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ పురస్కారాలకు ఎంపికయ్యారు.

    తెలుగు చిత్రాల్లోనూ...

    తెలుగు చిత్రాల్లోనూ...

    తెలుగులో ఆయన ‘ధర్మచక్రం' చిత్రంలో వెంకటేష్ తండ్రి పాత్రలో తనదైన ముద్ర వేసి టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. అదే విధంగా ‘శంకర్ దాదా ఎంబీబీఎస్' చిత్రంలో మెగాస్టార్ ఫాదర్ గా నటించారు. ఆయన నటించిన ఇతర భాషా చిత్రాలు తెలుగులోనూ అనువాదమై విడుదలయ్యాయి.

    గిరీష్ కర్నాడ్

    గిరీష్ కర్నాడ్

    గిరీష్ కర్నాడ్ మహారాష్ట్రలోని మాథెరన్‌లో 1938 మే 19న జన్మించారు. డాక్టర్ రఘునాథ్ కర్నాడ్, కృష్ణబాయి దంపతుల నలుగురు సంతానంలో గిరీష్ కర్నాడ్ ఒకరు. చిన్నతనం నుంచే నాటకాలు, సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్నాడు. ఆ తర్వాత సినిమా రంగం వైపు అడుగులు వేశారు.

    బెంగుళూరులో అంత్యక్రియలు

    బెంగుళూరులో అంత్యక్రియలు

    గిరీష్ కర్నాడ్ అంత్యక్రియలు సోమవారం బెంగులూరులో నిర్వహించబోతున్నారు. గిరీష్ కర్నాడ్‌కు రఘు కర్నాడ్ అనే కుమారుడు ఉన్నాడు. ఆయన రచయిత, జర్నలిస్టుగా పని చేస్తున్నారు. కర్నాడ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    Noted legendary actor, Girish Karnad passed away in his Benguluru residence today. He was 81 and died due to age related issues.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X