Just In
Don't Miss!
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Sports
ఆ రెండు జట్లు సంజూ శాంసన్ ఇవ్వమన్నాయి.. అందుకే రాజస్థాన్ అలా చేసింది!
- Finance
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి రూ.7 కోట్లు టోకరా వేసిన కేటుగాడిపై ఈడీ కేసు, ఆ సంస్థ ఆస్తులు అటా
- News
గ్రేటర్ మేయర్ నోటిఫికేషన్ రిలీజ్.. 11వ తేదీన సభ్యుల ప్రమాణం, అదేరోజు ఎన్నిక
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నితిన్ ఇంట్లో తప్పతాగి యువతి హల్‌చల్, లవ్వే కారణం!
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఇంట్లో ఓ యువతి హల్ చల్ చేసింది. శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ లోని నితిన్ ఇంటి గోడ దూకి లోనికి ప్రవేశించిన యువతి నితిన్ ను పెళ్లి చేసుకుంటానంటూ గొడవ చేసింది. రాత్రి పూట గోడ దూకిన తర్వాత ఇంట్లోకి వెళ్లడం వీలు కాక పోవడంతో రాత్రంతా ఇంటి ఆవరణలో ఉండి పోయింది.
సదరు యువతి అమీర్ పేటలో ఉంటున్నట్లు సమాచారం. నితిన్ అంటే ఎంతో అభిమానించే ఆ యువతి ఓ పబ్ లో తప్పతాగి అక్కడి నుండి నితిన్ ఇంటి వద్దకు చేరుకుంది. సెక్యూరిటీ గార్డ్స్ కంట పడకుండా వెనక వైపు నుండి గోడ దూకింది. అప్పటికే తాగిన మత్తు ఎక్కువ కావడంతో ఇంటి ఆవరణలోనే పడుకుంది.
https://www.facebook.com/TeluguFilmibeat

ఉదయం నిద్రలేచిన నితిన్ కుటుంబ సభ్యులు ఇంటి ఆవరణలో పడుకుని ఉన్న ఆ యువతిని చూసి షాక్ అయ్యారు. ఆమెను నిద్ర లేపగా....నితిన్ కోసం వచ్చానని, నితిన్ కావాలని, అతన్ని ప్రేమిస్తున్నానని, అతను లేకుండా జీవించలేనని, అతన్నే పెళ్లి చేసుకుంటానని గొడవ చేసింది. దీంతో వెంటనే నితిన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.
ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఆమె అనంతపురం జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి కూతురని తెలుస్తోంది. పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ నిర్వహించి ఆమె ఇంటి వద్ద వదిలి వేసారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా నితిన్ కుటుంబ సభ్యులు ఈ సంఘటనతో అవాక్కయ్యారు. ఒక వేళ ఇంకేమైనా జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అని ఆందోళన చెందారు. ఈ సంఘటన నేపథ్యంలో నితిన్ ఇంటికి భద్రత మరింత పెంచారు. ప్రహరీ గోడ ఎత్తు పెంచాలని నిర్ణయించారు.
వాస్తవానికి నితిన్‌కు ఆమె ఎవరో కూడా తెలియదు. కానీ గత కొంత కాలంగా నితిన్‌ను అభిమానిస్తూ వస్తున్న సదరు యువతి ఈ క్రమంలో అతనిపై ప్రేమ పెంచుకుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది వన్ సైడ్ లవ్ మేనియా. నితిన్ సినిమాల్లో ఇలాంటి సీన్లు ఉంటాయి. కానీ అతని నిజ జీవితంలోకి కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం విచిత్రమే మరి!