విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలకు వల.. యువకుడి అరెస్ట్

సినీ తారల పేర్లతో మోసాలకు పాల్పడటం తరచూ చూస్తూనే ఉంటాం. యాక్టర్లపై మోజుతో అమాయకులు ఆర్థికంగా, శారీరకంగా మోససోవడం జరుగుతూనే ఉంటున్నది. తాజాగా విజయ్ దేవరకొండ అని చెప్పి మోసానికి పాల్పడిన ఓ యువకుడు కటకటాలపాలయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నయవంచకుడి ఆట కట్టించారు. వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాను ఆసరాగా చేసుకొని

సోషల్ మీడియాను ఆసరాగా చేసుకొని

కొద్ది రోజులుగా సోషల్ మీడియాను ఆసరాగా చేసుకొని హీరో విజయ్ దేవరకొండ అని పరిచయం చేసి అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న వార్త ఇటీవల మీడియాలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అలా మోసానికి పాల్పడుతున్న యువకుడిని సైబర్ క్రైం పోలీసుల సహాయంతో విజయ్ దేవరకొండ టీమ్ చాకచక్యంగా పట్టుకున్నారు.

అమ్మాయిలా పరిచయం చేసుకొని

అమ్మాయిలా పరిచయం చేసుకొని

విజయ దేవరకొండ టీమ్ వెల్లడించిన ప్రకారం.. అమ్మాయిలను మోసగిస్తున్న వ్యక్తి ఫోన్ నంబర్‌ను కనిపెట్టేందుకు మాటల్లోకి దించాం. అతనితో ఒక అమ్మాయిలా పరిచయం చేసుకుని రివర్స్ ట్రాప్ చేయడం మొదలుపెట్టాం. అతడి మాటలను మా తరఫు వ్యక్తి మాటలు నమ్మినట్టు నటించాడు. నిన్ను కలవాలి. వెంటనే హైదరాబాద్‌కు రమ్మని నాటకం ఆడాం. దాంతో అతడు నమ్మి మా వద్దకు వచ్చారు అని తెలిపారు.

ట్రాప్‌లో పడిన మోసగాడు

ట్రాప్‌లో పడిన మోసగాడు

మేము ఆడిన నాటకాన్ని నమ్మిన యువకుడు వెంటనే హైదరాబాద్ బయల్దేరి వచ్చాడు.. అప్పటికే పోలీసులతో రెడీగా ఉన్న మా టీమ్ అతడిని పట్టుకుని స్టేషన్‌కు తరలించడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు అతడిని విచారిస్తున్నారు. విచారణలో బయటకు వచ్చిన భయంకరమైన వాస్తవాలు షాక్ గురిచేశాయి అని విజయ్ దేవరకొండ టీమ్ సభ్యులు అన్నారు.

Recommended Video

Hilarious Meme On Vijay Devarakonda Ananya Panday Viral Pic | Filmibeat Telugu
మరో ఇద్దరు హీరోల పేరుతో మోసం

మరో ఇద్దరు హీరోల పేరుతో మోసం

పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో మరో ఇద్దరు హీరోలకు చెందిన మహిళా అభిమానులను మోసగించినట్టు బయటకు వచ్చింది. మరో పదిమందిని ఇలానే మోసం చేశానని నిందితుడు అంగీకరించాడు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులోనే ఉన్నారు. త్వరలోనే మరిన్ని విషయాలు బయటకు వస్తాయి అని విజయ్ దేవరకొండ సభ్యులు పేర్కొన్నారు. ఇక ముందు హీరో విజయ్ దేవరకొండ పేరుతో నకిలీ అకౌంట్ల నుంచి మెసేజ్‌లు వచ్చినా ఎవరూ నమ్మొద్దు అని విజయ్ ఆఫీస్ టీమ్ తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X