గ్లామర్ గర్ల్ తమన్నా 'నో బికినీ క్లాజ్' (ఫొటోలు)
హైదరాబాద్: దక్షిణ భారత సినీ అభిమానుల మనసులు దోచుకున్న అందాల భామ తమన్నా. ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌లో రెండో ఇన్నింగ్సుకు సిద్ధమవుతోంది. హిమ్మత్‌వాలా చిత్రంతో ఈ హాట్ గర్ల్ హిందీ చిత్ర సీమలో అడుగుపెడుతోంది. హిమ్మత్‌వాలా హిందీ రీమేక్ 1983లో కె. రాఘవేంద్ర దర్శకత్వంలో వచ్చింది.
హిమ్మత్‌వాలా చిత్రంలో తమన్నా రంగురంగుల దుస్తుల్లో తన మంత్ర ముగ్ధుల్ని చేయడానికి సిద్ధపడుతోంది. అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. హిమ్మత్‌వాలా చిత్రం తమన్నాకు అప్పుడే బాలీవుడ్‌లో ఆఫర్లను తెచ్చిపెడుతోంది. సాజిద్ ఫర్హాద్ చిత్రంలో సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సరసన ఆమె నటిస్తోంది. ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. హిందీలో వెలిగిపోవడానికి ఆమె వస్త్రధారణలో పరిమితులు దాటడానికి ఇష్టపడడం లేదట.
ఇంతవరకు సినిమాల్లో తమన్నా బికినీ ధరించలేదు. లిప్ లాక్ దృశ్యాల్లో నటించలేదు. హిందీ సినిమాల విషయంలో కూడా దానికే కట్టుబడాలని ఆమె నిర్ణయించుకుంది. పాత హిమ్మత్‌వాలా చిత్రంలో జితేంద్ర, శ్రీదేవి నటించారు. శ్రీదేవి హిందీ ప్రేక్షకులను ఈ సినిమా ద్వారా మంత్రముగ్ధుల్ని చేసింది. తమన్నాకు కూడా ఆ అదృష్టం పట్టబోతోందని అంటున్నారు.

తాను బికినీలు ధరించబోనని, ముద్దు దృశ్యాల్లో నటించబోనని తమన్నా బాలీవుడ్ నిర్మాతలకు కొంత మందికి కచ్చితంగా చెప్పినట్లు సమాచారం. పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నా ఆమె అందుకు అంగీకరించడం లేదట.

దక్షిణాదిలో కూడా తమన్నా అవే మాటలు చెబుతూ వచ్చింది. పదే పదే అడిగినా కూడా తాను బికినీలు ధరించనని, లిప్ లాక్ సీన్స్ చేయనని చెబుతోంది.

టిపికల్ మసాలా సినిమాల గురించి అడిగినప్పుడు టైటిల్ రోల్స్ చేయడం కన్నా కమర్షియల్ సినిమాల్లో చేయడం హీరోయిన్లకు సవాల్ వంటిదని, ప్రేక్షుకుల దృష్టి ఆకట్టుకోవడానికి పరిమితమైన పాత్ర మాత్రమే ఉంటుందని ఆమె అంది.

బాగా నటించడం, కొద్ది సమయమే కనిపించినా ప్రేక్షకులను ఆకట్టుకోవడం యాక్టర్ పని అని, కొద్ది సీన్లలో మాత్రమే నటించే అవకాశం ఉన్న పాత్రలను చేయడం సవాల్ అని తమన్నా అభిప్రాయపడింది.

ప్రేక్షకుల ఇష్టానిష్టాలను దృష్టిలో పెట్టుకుని పాత్రను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని, కాంబినేషన్‌ను తాను ఎంజాయ్ చేయడం కూడా అంతే ముఖ్యమని, ప్రేక్షకులు చూసి ఆనందించాలని, అందుకే తాము చిత్రాలు చేస్తామని తమన్నా చెప్పింది.


Click it and Unblock the Notifications











