‘గ్లామర్’ వైఎస్ ఆర్ అంకితం

By Sindhu

గతంలో ప్రత్యూష, సర్ధార్ చిన్నపరెడ్డి, అయ్యప్పదీక్ష, రంగులకల, టి.నగర్ (తమిళ్) వంటి 15 చిత్రాలు నిర్మించిన నటుడు, దర్శక నిర్మాత పి. సత్యారెడ్డి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో 'గ్లామర్' చిత్రం రూపుదిద్దుకుంటోంది. 'శంకర్‌దాదా జిందాబాద్' చిత్రంలో నటించిన కరిష్మాకొటక్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది.

ఈ సందర్భంగా కరిష్మా కొటక్ మాట్లాడుతూ..శంకర్‌ దాదా జిందాబాద్ విడుదలైన తర్వాత తెలుగు నిర్మాతల నుంచి అనేక ఆఫర్స్ వచ్చినా కథలు నచ్చక అంగీకరించలేదు. దర్శకనిర్మాత సత్యారెడ్డి చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాను. సరైన అవగాహన లేకుండా సినీరంగంలో పైకి రావాలన్న తపనతో గ్లామర్ పరిశ్రమ గురించి రంగు, రంగుల కలలు కని ఇక్కడికి వచ్చి మోసపోయే వారికి ఈ చిత్రం డిక్షనరీలా ఉపయోగపడుతుందని కొటక్ చెప్పింది.

దర్శకనిర్మాత సత్యారెడ్డి మాట్లాడుతు ఈ చిత్రాన్ని నాగార్జునసాగర్, వైజాగ్, ముంబైలలో షూటింగ్ చేశామని చెప్పారు. చిత్రంలోని ఐదు పాటలు అద్భుతంగా వచ్చాయని, చక్కటి సందేశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కామెడీకి పెద్దపీట వేశామని దర్శకనిర్మాత తెలిపారు. తాను పడిన శ్రమ ఈ చిత్రం తగిన ఫలితాన్నిస్తుందని సత్యారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. నవంబర్ మొదటివారంలో ఆడియోను లహరి మ్యూజిక్ ద్వారా సినీ ప్రముఖుల సమక్షంలో విడుదల చేస్తామని చెప్పారు. నవంబర్ చివరి వారంలో సినిమాను విడుదల చేస్తామని అన్నారు. కాగా చలనచిత్ర పరిశ్రమ కోసం ఎన్నో సేవలు చేసిన దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్. రాజశేఖర రెడ్డికి ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంకా ఈ చిత్రంలో కరిష్మాకొటక్, ఫరాఖాన్, భువనేశ్వరి, తెలంగాణా శకుంతల, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, జీవా, కొండవలస, కళ్లు చిదంబరం, కవిత, గుండు హనుమంతరావు, జెన్ని తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం బొంబాయిరవి అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X