‘స్పైడర్’ అంటే మహేష్ బాబు కాదు, అదో రోబో.... (టీజర్ వచ్చేసింది)
మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పైడర్’ మూవీ టీజర్ రిలీజైంది.
హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పైడర్' మూవీ టీజర్ రిలీజైంది. వాస్తవానికి ఈ టీజర్ నిన్ననే రిలీజ్ అవ్వాల్సి ఉండగా దాసరి విషాదం నేపథ్యంలో ఈ రోజుకు వాయిదా వేసారు.
'స్పైడర్' టీజర్ తర్వాత మహేష్ బాబు సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. టీజర్ చూస్తుంటే సినిమలో హాలీవుడ్ తరహా టెక్నాలజీ ఉపయోగించారని స్పష్టం అవుతోంది. టీజర్ విడుదలైన కొన్ని క్షణాల్లోనే ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది.

స్పైడర్ టైటిల్ వెనక
ఈ సినిమాకు ‘స్పైడర్' అనే టైటిల్ పెట్టడంతో అంతా ఆశ్యర్యపోయారు. సినిమాలో స్పైడర్ లాంటి ఓ రోబో ఉంటుందని, అందుకే ఈ టైటిల్ పెట్టారని ఈ టీజర్ చూస్తే స్పష్టమవుతుంది.

భారీ బడ్జెట్
మహేష్ బాబు కెరీర్లనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళంలో రూ. 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హిందీలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

స్పడైర్
స్పైడర్ చిత్రాన్ని తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఠాగూర్ మధు, ఎన్ వి ప్రసాద్... ఎన్విఆర్ సినిమా ఎల్ఎల్‌పి అసోసియేషన్లో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్ ప్రొడక్షన్లో నిర్మిస్తున్నారు.

ముఖ్య పాత్రలు
మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా.... ఎస్ జె సూర్య విల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈచిత్రానికి హారిష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications












