Game Changer: రామ్ చరణ్ కి అరుదైన గౌరవం.. ఇండియాలోనే అతిపెద్ద క‌టౌట్.. ఎక్క‌డో తెలుసా?

Ram Charan: గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్‌ ఛేంజర్‌ (Game changer). ఈ సినిమాకు దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు శంకర్ (Shankar) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. కార్తీక్ సుబ్బ‌రాజు స్టోరీని అందించారు. పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్ గా తెరకెక్కిన ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు తెర‌కెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి​ కానుక‌గా జ‌న‌వ‌రి 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓ విషయంలో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏ విషయంలో అంటే..?

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న గేమ్‌ ఛేంజర్‌ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ .. ద్వి పాత్రలో నటించాడు. ఇందులో హీరోయిన్స్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, తమిళ ముద్దుగుమ్మ అంజలి నటించారు. అలాగే ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, సముద్రగని వంటి స్టార్ యాక్టర్స్ ప్రధాన పాత్రలో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్, జీ స్టూడియో బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించారు. ఈ సినిమా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

Global star Ram charan 250 feets CUT OUT launch at vajra grounds VIJAYAWADA

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటలు యూట్యూబ్ లో ట్రెండింగ్ మారాయి. అలాగే సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతూ వైరల్ గా మారాయి.దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న కొద్ది మూవీ మేకర్స్ ప్రమోషన్స్లలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ తరుణంలో ఎవరు ఊహించని విధంగా డిసెంబర్ 21 (నేడు) గేమ్ చేంజర్ సినిమా గ్రాండ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలోని డల్లాస్ లో నిర్వహించబోతున్నారు. ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా ప్రముఖ డైరెక్టర్ సుకుమార్, డైరెక్టర్ బుచ్చిబాబు హాజరు కాబోతున్నారు.

ఇదిలా ఉంటే.. ఒక టాలీవుడ్ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జరగడం ఇదే తొలిసారి. దీంతో మూవీ పై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఆంధ్రాలో కూడా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి గేమ్ చేంజర్ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించబోతున్నారట. ఇందుకోసం మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ ఎత్తున పకడ్బందీగా ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే మరో ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు అరుదైన గౌరవం దక్కబోతోంది. మెగా అభిమానులు ఇండియా సినిమాలోనే సరికొత్త రికార్డును నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 'గేమ్ చేంజర్' అందరు సినిమా విడుదల సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు సంబంధించిన అత్యంత భారీ కట్ అవుట్ ను ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడలోని బృందావన్ కాలనీ లోని వజ్ర గ్రౌండ్ లో రామ్ చరణ్ 250 అడుగుల కటౌట్ ను ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ 29 సాయంత్రం నాలుగు గంటలకు ఈ కటౌట్ ఓపెనింగ్ సంబంధించిన వేడుకలు జరగనున్నాయట.

Global star Ram charan 250 feets CUT OUT launch at vajra grounds VIJAYAWADA

ఈ కటౌట్ అత్యంత ఎత్తైన కటౌట్ గా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతుందని తెలుస్తోంది. ఇప్పటివరకు హీరో యశ్ అభిమానులు కేజిఎఫ్ సినిమా సమయంలో 107 అడుగుల కటౌట్ ను లాంచ్ చేశారు. ఇప్పటివరకు అది దేశంలో అతిపెద్ద కటౌట్ గా రికార్డు క్రియేట్ చేసింది ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేస్తూ రామ్ చరణ్ ఫాన్స్ 150 అడుగుల కటౌట్ ను ఏర్పాటు చేయబోతున్నారు.

More from Filmibeat

Read more about: game changer ram charan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X