Game Changer: ఇండియన్ పాలిటిక్స్‌లో రియల్ గేమ్ ఛేంజర్ పవన్ కల్యాణ్.. బాబాయ్ కాళ్లకు మొక్కి రాంచరణ్ ఎమోషనల్

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం 'గేమ్ చేంజర్'. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో శనివారం నాడు రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్ గారు, ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు, ఎమ్మెల్యే బత్తుల బలరాం గారు, ఎమ్మెల్సీ హరి ప్రసాద్ గారు, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గారు, కుడా చైర్మన్ తుమ్మల బాబు గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ మాట్లాడుతూ..

Global Star Ram Charan touches the Feet of Pawan Kalyan at Game Changer Pre Release Event

నమస్తే ఏపీ. చాలా దూరం నుంచి, చాలా శ్రమ తీసుకొని సినిమా పరిశ్రమ మీద అభిమానంతో చాలా దూరం నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన జనసందోహాన్ని చూస్తే.. మరో రోజు గుర్తుకు వస్తున్నది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మొదటి సారి నిర్వహించిన తన ర్యాలీలో రాజమండ్రి బ్రిడ్జీ మీద కనిపించిన జనసంద్రం నాకు గుర్తుకు వస్తున్నది. రాజమండ్రిలో ఈ సినిమా షూటింగ్‌ చాలా రోజుల చేశాం అని తెలిపారు.

గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన ఏపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు నా ధన్యవాదాలు. నేను చాలా మాట్లాడాలనుకొన్నాను. కానీ ముందు మీరు.. వెనక సినిమా యూనిట్ ఉండటంతో మాటలు రావడం లేదు. నిజంగా సినిమా పేరు గేమ్ ఛేంజర్. తెర మీద నేను చేసిన పాత్ర గేమ్ ఛేంజింగ్ పాత్ర కావొచ్చు. కానీ నిజ జీవితంలో ఇండియన్ పాలిటిక్స్‌లో నిజమైన గేమ్ ఛేంజర్ పవన్ కల్యాణ్. జనం కోసం ఎంతగా తాపత్రయ పడుతారో తెలుసు. ప్రజల కోసం ఎంత ఆలోచిస్తారో తెలుసు. ఆయన జీవిస్తున్న సమయంలో మేము పక్కన ఉండటం గర్వంగా ఉంది. అదే కుటుంబంలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాం అని రాంచరణ్ ఎమోషనల్ అయ్యాడు.

ఈ సినిమాలో శంకర్ గారు ఎవరిని చూసి ఈ క్యారెక్టర్ రాశాడో తెలియదు. కానీ నిజ జీవితంలో శ్రీ పవన్ కల్యాణ్‌ను చూసి రాసిన క్యారెక్టర్. చాలా చాలా మాట్లాడాలని ఉంది. మరో వేదిక మీద మాట్లాడుతాను. మీ మాదిరిగానే నాకు పవన్ కల్యాణ్, మన ఓజీ మాటలు వినాలనే ఆతృతగా ఉంది అని తన స్పీచ్‌ను ముగించాడు. ఆ తర్వాత తన బాబాయ్ కాళ్లకు నమస్కరించడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X