కొత్త నటులతో ‘అదిరె..అదిరె..’
గ్లోరియస్ మూవీ మేకర్స్ పతాకంపై 'అదిరె..అదిరే.." అనే చిత్రాన్ని ప్రారంభిస్తున్నట్లు నిర్మాత ఎన్ రామ్ మోహన్ రెడ్డి చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న తనకు సినిమా రంగమంటే ఆసక్తి ఎక్కువని చెప్పారు. ఇందులో కొత్తవారిని పరిచయం చేస్తున్నామని నిర్మాత చెప్పారు. ఆగస్టులో షూటింగ్ ప్రారంభించి డిసెంబరులో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నామని చెప్పారు.
ఈ చిత్రానికి కథను చరణ్ అందించారని, మొదటి భాగం కాలేజీ నేపథ్యంలో, రెండోభాగం కానేజీ ముగిసిన తర్వాత జీవితంపై ఉంటుందన్నారు. దర్శకుడు ఎం.చరణ్ బాబు మాట్లాడుతూ...ప్రమకథతో కూడిన ఈ చిత్రాన్ని కొత్తగా చూపే ప్రయత్నం చేస్తున్నామని, కమేడియన్స్ కూడా కొత్తవారిని పరిచయం చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రాజేష్ కాతూరి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎం.చరణ్ బాబు.
adire adire cinema logo release rammohan reddy charan babu అదిరె అదిరే లోగో ఆవిష్కరణ రామ్మోహన్ రెడ్డి


Click it and Unblock the Notifications