Sitara Ghattamaneni: సితార పేరుతో భారీ మోసాలు.. షాకింగ్ న్యూస్ చెప్పిన మహేశ్ టీమ్

సితార ఘట్టమనేని.. ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరం లేదు. దీనికి కారణం ఆమె సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు కావడమే. అంతేకాదు, ఈ చిన్నారి చిన్న వయసులోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ను సైతం దక్కించుకుంది. అన్నింటికీ మించి అప్పుడే కొన్ని బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరిస్తోంది. ఇలా పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్న సితారకు తాజాగా సైబర్ నేరగాళ్లు షాక్ ఇచ్చారు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!

మహేశ్ కూతురు.. ఫుల్ ఫేమస్:సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితార ఘట్టమనేని చిన్నప్పుడే ఫేమస్ అయింది. ఆ తర్వాత ఎదుగుతోన్న క్రమంలోనే ఈ చిన్నారి మరింత పాపులర్ అయింది. ముఖ్యంగా తన ముద్దు ముద్దు మాటలకు.. పాటలకు.. అల్లరికి ఎంతో మంది ఫిదా అయిపోయారు. అందుకే సోషల్ మీడియాలో సితారకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు భారీ స్థాయిలో వైరల్ అవుతూ ఉంటాయి.

GMB Team Alerts Netizens Over Fraud In The Name Of Sitara Ghattamaneni

యాక్టివ్‌గానే.. భారీ ఫాలోయింగ్:సోషల్ మీడియాలో సితార ఘట్టమనేని ఫుల్ యాక్టివ్‌గా ఉంటోందన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ చిన్నారి తనదైన రీతిలో రీల్స్ చేస్తూ, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ క్రేజ్ పెంచుకుంటోంది. అందుకే సితారకు ఇన్‌స్టాలో ఏకంగా 1.8 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. తన అభిమానులను అలరించేందుకు ఆమె మరింతగా సందడి చేస్తూ ముందుకు సాగుతోంది.

కేటుగాళ్ల ఉచ్చులో.. మోసాలు:సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతూ నెటిజన్లను తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ల కన్ను సితార ఘట్టమనేని మీద పడింది. కొద్ది రోజులుగా ఆమె పేరుతో కొందరు అగంతకులు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని మహేశ్ బాబు టీమ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

GMB Team Alerts Netizens Over Fraud In The Name Of Sitara Ghattamaneni

ఫిర్యాదు చేసి.. అలెర్ట్ చేసేలా:సితార ఘట్టమనేని పేరుతో కొందరు సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న విషయం మహేశ్ బాబు టీమ్ దృష్టికి వెళ్లింది. దీంతో వాళ్లు దీనిపై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని GMB టీమ్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అంతేకాదు, ఇలాంటి విషయాల్లో నెటిజన్లు అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా అనుమానం ఉంటే కంప్లైంట్ చేయాలని చెప్పింది.

ఆ లింకులు పంపుతున్నారని:తాజాగా GMB టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రకటనలో 'సితార ఘట్టమనేని పేరుతో కొందరు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ట్రేడింగ్, ఇన్వెస్టిమెంట్ లింకులు పంపుతున్నారు. ఈ విషయం మా దృష్టికి రావడంతో సైబర్ క్రైమ్‌కు కంప్లైంట్ చేశాము. ఆ నేరస్తులను పట్టుకునేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు. మీరు ఇటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండండి' అని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X