బన్నీతో చేయాలంటే 2కోట్లు డిమాండ్ చేసిన సెక్సీ హీరోయిన్...!
రాణాతో 'నేను నా రాక్షసి" సినిమాకి ఎనభై లక్షలు తీసుకున్న ఇలియానా, అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తీసే సినిమాలో నటించడానికి మాత్రం రెండు కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం. రాణా కంటే అల్లు అర్జున్ పెద్ద హీరో అయినా కానీ ఇలియానా ఎందుకని అంత డిమాండ్ చేసినట్టు? అర్జున్ తో నటించే అవకాశాన్ని కాలదనర్నుకునేలా ఎందుకు ప్రవర్తిస్తున్నట్టు?జిడ్డు దర్శకుడిగా పేరుపడ్డ త్రివిక్రమ్ తో చేయాలంటే ఆమాత్రం అడగాలని ఇలియానా చెప్పిందట జల్సా సినిమాని రెండేళ్ల పాటు తీసిన అతను తన విలువైన సమయాన్ని చాలా వృధా చేశాడని, కనుక త్రివిక్రమ్ తో సినిమా అంటే ఆ మాత్రం అడగాలని ఇలియానా వివరణ ఇచ్చిందట.
పూరి అంటే కేవలం అరవై రోజుల్లో తీసేశాడు కాబట్టి ఎనభై లక్షలు వర్కవుట్ అయిపోయిందని అనడంతో త్రివిక్రమ్ కూడా ఈ సినిమాని వంద రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పాడట. అలా అని అగ్రిమెంట్ రాసిస్తే చేయడానికి అభ్యంతరం లేదని చెప్పడంతో ఇలియానాకి కోటీ పది లక్షలు చెల్లించి ఈ చిత్రంలో పెట్టుకున్నారు. ఒకవేళ ముందుగా చెప్పిన దానికంటే ఎక్కువ కాల్ షీట్స్ ఇవ్వాల్సి వస్తే మాత్రం అదనంగా చెల్లించాలని ఇలియానా నిక్కచ్చిగా చెప్సేసిందట. ఆరేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంది కాబట్టి ఆ మాత్రం గ్రిప్ ఉంటుందిలెండి.


Click it and Unblock the Notifications











