The Kerala Storyపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు.. ఇది నిజమైన కథ.. వాళ్లందరు చూడాలి!

ఇటీవల కాంట్రవర్సీ పాలైన బాలీవుడ్ మూవీ ది కేరళ స్టోరీ. హార్ట్ ఎటాక్ బ్యూటీ అదా శర్మ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ట్రైలర్ విడుదల నుంచి అనేక విమర్శలు తలెత్తాయి. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ పలువురు నిరసనలు కూడా తెలిపారు. అయినా మొత్తానికి మే 5న వరల్డ్ వైడ్ గా విడుదల చేయగా దానికి బీభత్సమైన రెస్పాన్స్ వస్తోంది. దీంతో అనేక దేశాల్లో విడుదల చేయడమే కాదు తెలుగులో రిలీజ్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ది కేరళ స్టోరీ మూవీకి సపోర్ట్ గా ముఖ్యమంత్రి కామెంట్స్ చేశారు.

మే 5న రిలీజ్.. ఘన విజయం : బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ది కేరళ స్టోరి. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా క్రియేటివ్ డైరెక్టర్ గా విపుల్ అమృత్ బాధ్యతలు నిర్వహించారు. ఈ సినిమాలో అదా శర్మతోపాటు యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక అనేక వివాదాల మధ్య మే 5న రిలీజ్ అయి ఘన విజయం సాధించింది.

 the-kerala-story-movie-

యుక్తవయసుల వారు : ది కేరళ స్టోరీ సినిమాపై పలుచోట్ల నిషేధాలు, నిరసనలు ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఉగ్రవాదం ఎలా మొదలైందో తెలుసుకోవడానికి తల్లిదండ్రులు, యుక్త వయస్కులు కేరళ స్టోరీ సినిమా చూడాలని ఆయన కోరారు.

 the-kerala-story-movie-

ఇది నిజమైన కథ :"ఈ చిత్రం తీవ్రవాదానికి సంబంధించి నిజమైన కథను చూపిస్తుంది. మతమార్పిడి, ఉగ్రవాదంలో ISIS ఎలా పాల్గొంటుంది. అది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, సిరియా, భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కావొచ్చు. ఇది నిజమైన కథ. అందుకే తల్లిదండ్రులు, యువతీయువకులు చూడాలి" అని సావంత్ తెలిపారు.

 the-kerala-story-movie-

టెర్రరిజం పెరుగుతోంది : "వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. ఉగ్రవాదం వ్యాప్తి గురించి అప్రమత్తంగా ఉండాలి. అలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఈ స్లో పాయిజనింగ్ ఆగిపోతుంది. టెర్రరిజం నెట్ వర్క్ పెరుగుతోంది. దానిని అరికట్టడానికి ప్రయత్నాలు జరగాలి. బ్రెయిన్ వాష్, హిప్నాటిజం ద్వారా ప్రజలు దానికి ఎలా లొంగిపోతున్నారో మనం తెలుసుకోవాలి. అలా ట్రాప్ లో పడి వారు మోసపోతున్నారు" అని గోవా సీఎం ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు.

 the-kerala-story-movie-

ఫ్రీ ట్యాక్స్ ఉంటేనే : ది కేరళ స్టోరీకి మీ ప్రభుత్వం ఫ్రీ ట్యాక్స్ ఇస్తుందన్న ప్రశ్నకు "పన్ను రహితంగా చేస్తే ప్రజలు చూస్తారని కాదు. ప్రాముఖ్యతను తెలుసుకోవాడనికి వారు దీన్ని చూడాలి. గరిష్టంగా ప్రజలు తమ యుక్త వయస్సులోని పిల్లలతో పాటు ఈ సినిమాను చూడాలి. ఉగ్రవాదానికి సంబంధించి తెరకెక్కించిన ఈ సినిమాను మతతత్వ కోణంలో చూడకూడదు" అని సావంత్ చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X