పోలీసులకు 'సింగం' సినిమా పాఠాలు
అజయ్ దేవగన్ 'సింఘం'నుంచి గోవా పోలీసులు పాఠాలు నేర్చుకోనున్నారు. నిజాయితీ కలిగిన పోలీసుగా అజయ్ ఇందులో నటించారు. ఇది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. గోవా కళా అకాడెమీ ఆడిటోరియంలో తమ పోలీసు అధికారులకు ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని చూపించదలచామని రాష్ట్ర డిజిపి ఆదిత్య ఆర్య చెప్పారు. ఈ ఆడిటోరియంలో 900 సీట్లున్నాయి. అంటే 900 మంది చూడవచ్చన్న మాట. సరైన రీతిలో మార్గదర్శనం చేసేందుకు ఈ చిత్రం తిలకించటం తోడ్పడుతుందని ఆయన చెప్పారు. వారికి స్ఫూర్తనిస్తుందన్నారు. ఎవరైనా అధికారి మంచి మార్గంలో నడచితే మిగతావారు అనుసరిస్తారని ఆయన పిటిఐకి చెప్పారు. పోలీసు శాఖలో ఒక్క వ్యక్తి చెడుగా ప్రవర్తించినా మొత్తం డిపార్టుమెంటుకే చెడ్డపేరు వస్తుందన్నారు. వారు సమాజానికి మంచి చేయాలి అని తాను ఆశిస్తున్నానన్నారు. రోహిత్ షెట్టి నిర్మించిన సింఘమ్ లోని పలు దృశ్యాలను గోవాలోనే చిత్రీకరించారు. గోవా పోలీసుల ప్రస్తావన కూడా ఇందులో ఉంది. దేవగన్ సూపర్ కాప్ పాత్రను పోషించారు. డిపార్టుమెంటు లోపల వెలుపల కూడా ఆయన పోరాటాలు చేస్తారు.


Click it and Unblock the Notifications











