»   » డబ్బు అవసరమే, అదే జీవితం కాదు: రాజమౌళి స్పీచ్ అదుర్స్

డబ్బు అవసరమే, అదే జీవితం కాదు: రాజమౌళి స్పీచ్ అదుర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

జీవితంలో డబ్బు ఒక్కటే ప్రధానం కాదని, దానికన్న గొప్పది ఆశయం అని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. మనం అనుకున్నది సాధించినపుడు మిగతావన్నీ దానంతట అవే వస్తాయని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో అసిఫా ఇండియా ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యానిమేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మనందరికీ డబ్బు కావాలి

మనందరికీ డబ్బు కావాలి

మనందరికీ డబ్బు కావాలి, ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం కూడా. డబ్బు మన అవసరాలను తీరుస్తుంది. అంత మాత్రాన డబ్బు మాత్రమే జీవితంలో ముఖ్యమైనది అనుకుంటే పొరపాటే అని రాజమౌళి తెలిపారు.

 ప్రతి వ్యక్తికి ఒక గోల్ ఉండాలి

ప్రతి వ్యక్తికి ఒక గోల్ ఉండాలి

కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా ముందుకు వెళ్లకూడదు. మనకంటూ ఒక ఆశయం, ఒక గోల్ పెట్టుకుని దాన్ని అందుకునేందుకు ప్రయత్నించాలి. నువ్వు నీ గోల్ చేరుకుంటే డబ్బుతో పాటు పేరు ప్రతిష్టలు కూడా వస్తాయని రాజమౌళి తెలిపారు.

 బాహుబలి కోసం ఐదేళ్లు కష్టపడ్డ రాజమౌళి

బాహుబలి కోసం ఐదేళ్లు కష్టపడ్డ రాజమౌళి

బాహుబలి ప్రాజెక్టు కోసం రాజమౌళి దాదాపు ఐదేళ్ల పాటు పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడ్డ సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఒక గోల్ గా పెట్టుకుని అహర్నిషలు అంకిత భావంతో కష్టపడ్డారు కాబట్టే విజయంతో పాటు డబ్బు, పేరు ప్రతిష్టలు సొంతం చేసుకున్నారు.

 ఎంతో మందికి రాజమౌళి ఆదర్శం

ఎంతో మందికి రాజమౌళి ఆదర్శం

విజయవంతమైన సినిమాలు తీస్తూ యువ దర్శకులకు ఆదర్శంగా నిలుస్తున్న రాజమౌళి సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ, సేవా కార్యక్రమాలు చేస్తూ రాజమౌళి తన ప్రత్యేకత చాటుకుంటున్నారు.

రాజమౌళి నెక్ట్స్ మూవీ

రాజమౌళి నెక్ట్స్ మూవీ

దర్శకుడు రాజమౌళి ‘బాహుబలి-2' తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. త్వరలో ఆయన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో మల్టీ స్టారర్ మూవీ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

English summary
Tollywood director SS Rajamouli said that money is not all the thing and added that it is a goal which is more important. He said after achieving the goal, all other things will automatically come on the way.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu