For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లింగరీలో గోవా బ్యూటీ ఇలియానా(హాట్ ఫొటో)

  By Srikanya
  |

  హైదరాబాద్ : బాలీవుడ్ లో సెటిలవ్వటానికి ఎన్ని ప్రయత్నాలో చేయాలో అన్నీ గోవా బ్యూటీ ఇలియానా చేస్తోంది. అక్కడ అందాల ప్రదర్శనకు థీటుగా తానూ చేయగలనని ప్రూవ్ చేస్తూ ఇలా రోజుకో రకంగా కనపడుతోంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న హ్యాపీ ఎండింగ్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఆమె ఇలా రెచ్చిపోతోంది. ఇది చూసిన బాలీవుడ్ జనం...ఇక్కడ నీళ్లు బాగానే వంటబట్టాయి...ఇక ఇక్కడ బిజీ అవ్వటం ఖాయం అంటున్నారు. ఇలియానా మాత్రం ఇదంతా చిత్రం ప్రమోషన్ లో భాగం...అయినా లేటెస్ట్ ఫ్యాషన్స్ లో కనిపించటానకి నేను ఇష్టపడతా అని వగలు పోతూ చెప్తోంది.

  తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమయంలోనే ‘బర్ఫీ' చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైన ఇలియానా మొదటి చిత్రంతోటే ఆకట్టుకుంది. దాని తర్వాత ‘ఫటా పోస్టర్‌ నిక్లా హీరో', ‘మై తేరా హీరో' సినిమాలు చేసిన ఆమె ఇప్పుడు రాజ్‌ అండ్‌ డీకే డైరెక్ట్‌ చేస్తోన్న ‘హ్యాపీ ఎండింగ్‌'లో హీరోగాన్ నటిస్తోంది.

  గత రెండేళ్లుగా సక్సెస్ లేని సైఫ్, ఇలియానా...ఈ ఏడాది హ్యాపీ ఎండింగ్ ఇస్తుందని ఆశిస్తున్నారు. గతంలో వచ్చిన బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ చిత్రాలకు ‘హ్యాపీ ఎండింగ్' ఏ మాత్రం తీసిపోదని అంటున్నారు. గోవింద, ప్రీతిజింతా కూడీ ఈ చిత్రంలో మరో జంటగా కనిపించబోతున్నారు. రాజ్ నిడిమోరు- కృష్ణ డీకె డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ఇద్దరూ మన తెలుగు వారే కావడం విశేషం. ఈ సినిమా నవంబర్ 21న విడుదల కానుంది.

  Goan Beauty Ileana in a Lingerie!

  ఇలియానా తదుపరి చిత్రాలు విషయానికి వస్తే....

  సైఫ్‌ అలీఖాన్‌ జోడీగా ‘హ్యాపీ ఎండింగ్‌' సినిమాలో నటిస్తున్న బక్కపలుచని భామ ఇలియానా తాజాగా ఓ జాక్‌పాట్‌ కొట్టినట్లు వినిపిస్తోంది. తన తదుపరి చిత్రంలో ఆమె ఏకంగా షారుఖ్‌ఖాన్‌ సరసన నటించే ఛాన్స్‌ పొందిందనేది తాజా ఖబర్‌. ఓవైపు ఫరాఖాన్‌ డైరెక్ట్‌ చేసిన ‘హ్యాపీ న్యూ ఇయర్‌' సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్న షారుఖ్‌ మరోవైపు యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ నిర్మిస్తున్న ‘ఫ్యాన్‌' సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లోనూ పాలు పంచుకుంటున్నాడు.

  ఇందులో ఆయన జోడీగా పలువురి పేర్లు వినిపించగా, ఇలియానా ఆ పాత్రను దక్కించుకున్నట్లు సమాచారం. అదివరకు వాణీకపూర్‌, పరిణీతి చోప్రా పేర్లు కూడా ఈ పాత్రకు వినిపించాయి. ‘ఫ్యాన్‌'ను మనీశ్‌శర్మ రూపొందించనుండగా, హబీబ్‌ ఫైజల్‌ రచన చేస్తున్నాడు. అక్టోబర్‌లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్తోంది. సుదీర్ఘకాలంగా తను అభిమానిస్తున్న వ్యక్తిని కలవాలని సంకల్పించుకునే ఓ అభిమాని కథ ‘ఫ్యాన్‌'. 2015 ఆగస్ట్‌ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.

  ఇలియానా వ్యక్తిగత విషయాల్లోకి వెళితే...

  ఆమె ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌‌తో డేటింగ్ చేస్తోంది. ఇలియానా-ఆండ్రూ మధ్య దాదాపు మూడేళ్ల పరిచయం ఉంది. రెండేళ్ల క్రితం క్రితం ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి ఇద్దరి మధ్య రిలేషన్ బాగా పెరిగింది.

  English summary
  Here is how Ileana graced the promotion look of her upcoming movie 'Happy Ending'. She sets the mercury levels high by appearing in a red lace bra let and pencil leather skirt.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X