twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మలో మరో మనిషి.. నన్ను లైంగికంగా వేధించాడు: బాంబు పేల్చిన జయకుమార్

    |

    Recommended Video

    వర్మ నన్ను లైంగికంగా వేధించాడు.. బాంబు పేల్చిన జయకుమార్ !

    'జీఎస్‌టీ'పై కావాల్సినంత రచ్చ జరుగుతోంది. ఓవైపు మహిళ సంఘాల ఆందోళనలు, ఫిర్యాదులు కొనసాగుతుంటే.. మరోవైపు జయకుమార్ అనే రచయిత కాపీ ఆరోపణలతో రచ్చకెక్కాడు. స్పందించిన ఆర్జీవి.. వాడో దొంగ అంటూ తేల్చిపారేయడంతో జయకుమార్ నుంచి అనూహ్య ఆరోపణలు వెల్లువెత్తాయి. వర్మలో చాలామందికి తెలియని మరో మనిషి ఉన్నాడని పెద్ద బాంబు పేల్చాడు.

    'జీఎస్‌టీ'కి పోటెత్తుతున్న ట్రాఫిక్: నేడే విడుదల, ఆ కామెంట్‌తో మరో వివాదంలో వర్మ..'జీఎస్‌టీ'కి పోటెత్తుతున్న ట్రాఫిక్: నేడే విడుదల, ఆ కామెంట్‌తో మరో వివాదంలో వర్మ..

     వర్మలో మరో మనిషి?

    వర్మలో మరో మనిషి?

    రాంగోపాల్ వర్మలో మరో మనిషి ఉన్నాడని చెప్పిన జయకుమార్.. ఆయన్ను బాలీవుడ్ హార్వీ వీన్‌ స్టీన్‌‌గా అభివర్ణించాడు. హాలీవుడ్‌లో ఎంతమంది తారల జీవితాలతో ఆడుకున్న ప్రొడ్యూసర్ హార్వీ వీన్ స్టీన్‌తో వర్మను పోల్చడం ఇప్పుడు సంచలనంగా మారింది.

    వాడో దొంగ.. ఆఫీసు నుంచి గెంటేశాం, ఇన్నాళ్లు ఎందుకు సైలెంట్‌గా ఉన్నానంటే: జయకుమార్‌పై ఆర్జీవివాడో దొంగ.. ఆఫీసు నుంచి గెంటేశాం, ఇన్నాళ్లు ఎందుకు సైలెంట్‌గా ఉన్నానంటే: జయకుమార్‌పై ఆర్జీవి

     లైంగిక వేధింపులు:

    లైంగిక వేధింపులు:

    వర్మ అసహజ శృంగారానికి పాల్పడే వ్యక్తి అని ఆరోపించిన జయకుమార్.. డబ్బు ఆఫర్ చేసి తనను చాలాసార్లు హోటల్ రూమ్స్‌కు రమ్మన్నాడని, లైంగికంగా తనను వేధించాడని ఆరోపించాడు. వర్మ ఆపర్స్‌ను తిరస్కరిస్తూ వస్తున్న కొద్ది తనపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించాడు.

     అసలు రంగు ఇదే..:

    అసలు రంగు ఇదే..:

    సక్సెస్‌ఫుల్ పర్సనాలిటీలతో పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశించడం సహజమని, తాను కూడా అలాగే అనుకుని వర్మతో కలిసి పని చేశానని అన్నారు. కానీ ఆయనలో మరో మనిషి ఉన్నాడని జయకుమార్ విమర్శించారు. వర్మ లెక్కలు వేరుగా ఉంటాయని, సందర్భం వచ్చినప్పుడు ఆయన అసలు రంగు బయటపెడుతారని చెప్పుకొచ్చారు.

    #మీటూవర్మ క్యాంపెయిన్..:

    #మీటూవర్మ క్యాంపెయిన్..:

    రాంగోపాల్ వర్మ 'హోమో సెక్సువల్' అని తాను చెప్పడం లేదని, కానీ వర్మ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతానని జయకుమార్ పేర్కొనడం గమనార్హం. వర్మ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందని, వర్మ బాధితులంతా ముందుకు వచ్చి #మీటూవర్మ క్యాంపెయిన్ లో భాగమవ్వాలని జయకుమార్ సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు.

     పెద్ద దుమారమే..:

    పెద్ద దుమారమే..:

    జయకుమార్ ఆరోపణల్లో నిజమెంతనేది తెలియదు కానీ రోజురోజుకు ఈ వివాదం మరింత దిగజారుతున్నట్లే కనిపిస్తోంది. జయకుమార్ చేసిన తాజా ఆరోపణలకు వర్మ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. వర్మ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా అతను పోరాటం చేస్తానని చెప్పడం మాత్రం పెద్ద దుమారమే లేపేలా ఉంది.

     జయకుమార్ పై వర్మ ఫిర్యాదు..:

    జయకుమార్ పై వర్మ ఫిర్యాదు..:

    వర్మ తన కథ కాపీ కొట్టాడని జయకుమార్ ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు వర్మ సైతం జయకుమార్ పై పలు ఆరోపణలు చేశాడు. తన సంస్థలో అతను చాలాసార్లు దొంగతనానికి పాల్పడ్డాడని, ఆఖరికి జీఎస్‌టీ కథను కూడా తమ కంప్యూటర్ నుంచి హ్యాక్ చేసి ఉంటాడని ఆరోపిస్తూ.. సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపాడు.

    మరిన్ని ఆందోళనలు..:

    మరిన్ని ఆందోళనలు..:

    జయకుమార్ సంగతి అలా ఉంచితే.. మహిళ సంఘాలు, ఫెమినిస్టులు వర్మపై ఆందోళనలు, ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాయి. ఎప్పటిలాగే వర్మ మాత్రం డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. 'జీఎస్‌టీ' నేడే విడులైంది కాబట్టి.. దీనిపై వచ్చే స్పందనను బట్టి వర్మపై మరిన్ని ఫిర్యాదులు, ఆందోళనలు వెల్లువెత్తవచ్చు.

    English summary
    Jaya Kumar alleged Ram Gopal Varma of sexually harassing and dubbed him as "the Harvey Weinsten of Bollywood". "He prides on being "macho" but he is just a sex freak with money.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X