'గాడ్,సెక్స్&ట్రూత్' లీకైన ఫోటో ఇదే: వర్మ పక్కన న్యూడ్‌గా మియా మాల్కోవా..

Recommended Video

'గాడ్,సెక్స్&ట్రూత్' లీకైన ఫోటో ఇదే.. మాల్కోవా న్యూడ్ గా..!

వివాదాలే వర్మ సినిమాలకు మార్కెటింగ్ స్ట్రాటజీ. తద్వారా వచ్చే పబ్లిసిటీ.. దాని మీద జరిగే రచ్చ.. టీవి చానెళ్ల డిబేట్స్.. మొత్తంగా ఆయన కంటెంట్ ఎంతమందికి చేరాలో అంతమందికీ చేరుతుంది. సమాజం.. సంస్కారం లాంటి మాటలతో వర్మను అడ్డుకోవడం ఇప్పటిదాకా ఓ విఫలయత్నంగానే మిగిలిపోయింది. 'గాడ్ సెక్స్&ట్రూత్' విషయంలోనూ అది విఫలయత్నమేనేమో!. ఇదంతా పక్కనపెడితే.. ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని చిత్రాలు లీకవడం గమనార్హం.

లీకైన ఫోటో:

లీకైన ఫోటో:

జీఎస్‌టీ( గాడ్ సెక్స్&ట్రూత్ )కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాకు లీకవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. షూటింగ్ సందర్భంగా వర్మ సీన్స్ ను మానిటర్ చేస్తున్న సమయంలో.. ఆయన పక్కనే మియా మాల్కోవా న్యూడ్ గా నిలుచున్న ఫోటో తెగ వైరల్ అవుతోంది.

వర్మ పబ్లిసిటీ స్టంట్?:

వర్మ పబ్లిసిటీ స్టంట్?:

జీఎస్‌టీ పోస్టర్ లీక్ అయిందా?.. లేక స్ట్రాటజీ ప్రకారం వర్మనే లీక్ చేశాడా? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రశ్న. వివాదాలతో పబ్లిసిటీని కోరుకునే వర్మ.. ఈ పోస్టర్ తో మరింత పబ్లిసిటీ వస్తుందని భావించే.. దీన్ని సోషల్ మీడియాలో వదిలారనేది కొంతమంది వాదన.

దొంగచాటుగా తీసింది కాదు..:

దొంగచాటుగా తీసింది కాదు..:

లీకైన ఫోటోను చూస్తుంటే.. అది దొంగచాటుగా తీసినట్లు కనిపించడం లేదు. షూటింగ్ టైమ్ లో అఫీషియల్ గా తీసిన ఫోటోల లాగే కనిపిస్తోంది. కాబట్టి వర్మ ఉద్దేశపూర్వకంగానే ఈ ఫోటోను సోషల్ మీడియాలో లీక్ చేసి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బూతును సమర్థించుకోవడమే: దేవిప్రియ

బూతును సమర్థించుకోవడమే: దేవిప్రియ

వర్మ చేస్తున్న పని బూతును సమర్థించుకుంటూ బూతును అమ్ముకోవడమేనని అంటున్నారు సామాజిక కార్యకర్త దేవిప్రియ. ఓ పత్రికా ప్రతినిధితో మాట్లాడుతూ.. స్త్రీ శరీరాన్ని సరుకుగా చేసుకుని అమ్మేవాళ్లు ఆర్జీవిలా మాటలు చెబుతారని అన్నారు. పోర్న్ నిద్రాణంగా ఉన్న నేరప్రవృత్తిని రెచ్చగొడుతుందని, లైంగిక జీవితం వేరు, పోర్న్‌లో చూపించే సెక్స్ వేరు అని చెప్పుకొచ్చారు.

 సమర్థిస్తున్న కత్తి:

సమర్థిస్తున్న కత్తి:

ఫిలిం క్రిటిక్ మహేష్ కత్తి మాత్రం వర్మ 'జీఎస్‌టీ'ని సమర్థిస్తున్నారు. నేర స్వభావానికి పోర్న్‌కు సంబంధం లేదని, ఇంతవరకు అది నిరూపితం కాలేదని అంటున్నారు. కోరికల్ని అణుచుకుని బతికే సమాజంలో పోర్న్ వల్ల కొంత మేలు జరుగుతుందని ఆయన చెప్పడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X