GodFather Pre Release Event: ఈవెంట్ కు మెగాస్టార్ ఆలస్యం.. కారణం చెబుతూ ఆడియో పంపిన చిరు
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో నిర్వహించారు. గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో జరిగిన ఈవెంట్ కు మెగా అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్లో అందరూ కూడా మెగాస్టార్ గొప్పతనం గురించి ఎంతో ఉన్నతంగా మాట్లాడారు. ఇక ఈ వేడుకకు మెగాస్టార్ అనుకున్న సమయం కంటే కొంత ఆలస్యంగా వస్తూ ఉండడంతో ముందుగానే ఆయన ఒక ఆడియో కూడా అనంతపురం వాసుల కోసం పంపారు.
అనంతపూర్ వాసులందరికీ కూడా నమస్తే.. నేను మీ చిరంజీవిని.. దారిలో ఉన్నాను. నేను వచ్చేస్తున్నాను. కొంచెం లేట్ అయింది. నాకోసం అక్కడ ఎంతో మంది ఎదురుచూస్తున్నారు అనేది నాకు తెలుసు. అందుకు నేను వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు విశాఖపట్నంలో షూటింగ్ చేసి మధ్యాహ్నం ఫ్లైట్ తీసుకొని రావడానికి కొంచెం లేట్ అయింది. మీరు మరో రకంగా అనుకోవద్దు. మీరు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.. అని నాకు తెలుసు. మిమ్మల్ని కలుసుకోవడానికి. అంతకంతకు ఉత్సాహంతో నేను కూడా ఉన్నాను.

నేను వీలైనంత తొందరగా రావడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ట్రైలర్ బాగుంది అని మీరందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు అనిపిస్తోంది. దయచేసి నాకోసం వెయిట్ చేయండి. కొద్దిసేపట్లో మీ ముందు ఉంటాను. థాంక్యూ.. అని మెగాస్టార్ చిరంజీవి ఎంతో సున్నితంగా తన ఆలస్యం గురించి అభిమానులకు తెలియజేశారు. అంత పెద్ద మెగాస్టార్ స్టార్ హోదాలో ఉన్నప్పటికీ కూడా ఆయన అంత రిక్వెస్ట్ చేస్తూ వివరణ ఇవ్వడంతో ఫ్యాన్స్ అందరు కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఇక విడుదలైన ట్రైలర్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











