గోల్డెన్ గ్లోబ్ 2020 అవార్డ్స్ నామినేషన్స్: లీడ్‌లో మ్యారేజ్ స్టోరీ, ఐరిష్ మాన్
సినీ పరిశ్రమలో ఆస్కార్ అవార్డులతో సమానంగా పరిగణించే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2020 నామినేషన్స్ సోమవారం అనౌన్స్ చేశారు. ఈ నామినేషన్స్‌లో లీడ్‌లో మ్యారేజ్ స్టోరీ, ఐరిష్ మాన్ సినిమాలు నిలవడం విశేషం. 2020 సంవత్సరానికి గాను 77వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులుగా ఈ సంవత్సరం నామినేషన్స్ స్వీకరించారు. వివరాల్లోకి పోతే..

మ్యారేజ్ స్టోరీ, ఐరిష్ మాన్
మ్యారేజ్ స్టోరీ, ది ఐరిష్ మాన్ సినిమాలు ఈ 77వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు నామినేషన్స్ లో లీడింగ్ పొజీషన్‌లో ఉన్నాయి. మ్యారేజ్ స్టోరీ సినిమాకు 6 కేటగిరీల్లో నామినేషన్స్ రాగా, ది ఐరిష్ మాన్ సినిమాకు గాను 5 కేటగిరీల్లో నామినేషన్స్ దాఖలయ్యాయి.

నామినేషన్స్‌లో ఎవరెవరికి చోటు?
మ్యారేజ్ స్టోరీ సినిమాలో నటించిన స్కార్లెట్ జోహాన్సన్, ఆడమ్ డ్రైవర్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకోగా, ఈ సినిమాకు దర్శకత్వం వహించిన నోహ్ బిమ్బాక్ నామినేషన్ దక్కించుకోలేక పోయారు. ఇక ది ఐరిష్ మాన్ సినిమా దర్శకుడు స్కోర్సెసే బెస్ట్ డైరెక్టర్ కేటగిరిలో నామినేట్ అయ్యాడు. అలాగే ఈ సినిమా నుంచి బెస్ట్ యాక్టర్ నామినేషన్ మాత్రం చోటు దక్కించుకోలేదు.

బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో నామినేషన్స్
బాంగ్ జూన్ హో, "పరాసితే"
సామ్ మెండిస్, "1917"
క్యూటిన్ టరంటినో, "వంశ్ అపాన్ ఏ టైం ఇన్ హాలీవుడ్"
మార్టిన్ స్కోర్సెసే, "ది ఐరిష్ మాన్"
టాడ్ ఫిలిప్స్, "జోకర్" లకు బెస్ట్ డైరెక్టర్ కేటగిరీల్లో నామినేషన్స్ దక్కాయి.

బెస్ట్ యాక్టర్ కేటగిరీ చూస్తే..
క్రిస్టియన్ బాలే, "ఫోర్డ్ వీ. ఫెరారీ"
ఆంటోనియో బండెరస్, "పెయిన్ అండ్ గ్లోరి"
ఆడమ్ డ్రైవర్, "మ్యారేజ్ స్టోరీ"
జోయాక్విన్ ఫోనిక్స్, "జోకర్"
జోనాథన్ ప్రైసె, "ది టు పోప్స్" సినిమాలకు గాను బెస్ట్ యాక్టర్ కాటగిరీల్లో చోటు దక్కించుకున్నారు. ఈ అవార్డులకు జనవరి 5న ప్రధానం చేయనున్నారు.

బెస్ట్ మోషన్ పిక్చర్ - డ్రామా కేటగిరీలో నామినేషన్స్
"1917"
"ది ఐరిష్ మాన్"
"జోకర్"
"మ్యారేజ్ స్టోరీ"
"ది టు పోప్స్"


Click it and Unblock the Notifications











