ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ప్రతిభకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మకమైన గోల్డెన్‌గ్లోబ్ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయుడుగా ఆయన రికార్డు సృష్టించారు. 'స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రానికిగాను ఆయనకు ఈ అవార్డు లభించింది. ఈ చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డుకూడా లభించింది. సైమన్‌బ్యుఫోయ్ ఈ అవార్డు గెలుచుకున్నారు. ఇదే చిత్రంలోని జయహో పాటకుగాను గీత రచయిత గుల్జార్‌కు ఉత్తమ గీతరచయిత అవార్డు లభించింది. ఇంకా ఇదే చిత్రానికిగాను డాన్‌బోయ్ల్‌కు ఉత్తమ దర్శకుడు అవార్డు కూడా లభించింది. భారతీయ రాయబారి వికాస్‌స్వరూప్ రాసిన ఓ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని అనిల్‌కపూర్, ఇర్ఫాన్‌ఖాన్‌లతో నిర్మించారు. ముంబయిలోని ఓ మురికివాడలో నివసించే జమాల్ అనే వ్యక్తి తన ప్రేమను గెలిచేందుకు ఓ భారతీయ రియాల్టీషోలో పాల్గొని మొదటి బహుమతిగదెలవటంఒ దీని ఇతివృత్తం.