»   » గోపీచంద్..'గోలీమార్' ఆడియో రిలీజ్

గోపీచంద్..'గోలీమార్' ఆడియో రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న గోలీమార్ చిత్రం ఆడియో జయభేరీ క్లబ్ హైదరాబాద్ లో విడుదల అయ్యింది. చక్రి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో పంక్షన్ కి ఛీప్ గెస్ట్ గా ప్రభాస్ హాజరయ్యారు. పూరీ జగన్నాధ్, వివి వినాయిక్, బెల్లెంకొండ, ప్రభాస్, దిల్ రాజు, ప్రియమణి, శ్రీను వైట్ల, దానయ్య, ఎమ్.ఎల్.కుమార్ చౌదరి, బివియన్ ఎస్ ప్రాస్ద, బోయపాటి శ్రీను, శ్యామ్ కె నాయుడు, చక్రి మిగతా యూనిట్ సభ్యులు ఈ ఆడియో పంక్షన్ కి వచ్చారు. వివి వినాయిక్ ఆడియో సీడీని లాంచ్ చేసి మొదటి కాపీని ప్రభాస్ కి ఇవ్వగా, శ్రీను వైట్ల ఆడియో క్యాసెట్ ని లాంచ్ చేసి బోయపాటి శ్రీనుకి అందచేసారు.

ఈ సందర్భంగా దర్శకుడు పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ...ఈ కథను నేను ముంబై ఎనకౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ జీవితంలోని కొన్ని సంఘటనలు ఆధారంగా రూపొందించాను. మొదట ఈ కథను దర్శకుడు వివి వినాయిక్ కి వినిపించాను. అతను బావుందని చెప్పి ప్రోత్సహించాడు. ఇక నాకు వ్యక్తిగతంగా పోలీసులు అంటే ఇష్టం. అందుకే నా సినిమాల్లో పోలీస్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది అన్నారు. అలాగే హీరో గోపీచంద్ పోలీస్ గా టెర్రిఫిక్ ఫెరఫాన్మెన్స్ ఇచ్చాడు. నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ చిత్రం ఫస్ట్ కాపీ చూడకుండానే మరో చిత్రం ఆఫర్ ఇచ్చారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu