'గోలీమార్‌' కు ప్రేరణ అదే...పూరీ జగన్నాధ్

By Srikanya

గోపీచంద్‌, ప్రియమణి జంటగా పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్‌ నిర్మిస్తున్న 'గోలీమార్‌' త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ" ఓ పవర్‌ఫుల్‌ కథతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ముంబయిలో పేరొందిన పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ దయానాయక్‌ ఈ కథకు ప్రేరణగా నిలిచాడు. ఈ చిత్రంలో ప్రేక్షకులు కొత్త గోపీచంద్ ‌ను చూస్తారు' అన్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ...నేను నిర్మాతగా వెనుకబడి ఉన్న సమయంలో పూరి జగన్నాథ్ నన్ను పిలిచి ఈ చిత్రం చేస్తానన్నారు. ఆయనతో చిత్రాన్ని నిర్మించడం ఒక గొప్ప అనుభూతిని కలిగించింది. ఈ చిత్రం మా యూనిట్ మొత్తానికీ మంచి పేరు తెస్తుంది. సినిమా బాగా వచ్చింది. తప్పకుండా విజయవంతమవుతుందనే నమ్మకం ఉంది. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. చక్రి హిట్‌ స్వరాలను అందించాడు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో చాలా అంచనాలున్నాయి. అది నిజం చేస్తుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో సినిమా చేయడం ఆనందంగా వుందని, తన కెరీర్‌లోనే ఇది మరపురాని చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం వుందని గోపీచంద్‌ చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: శ్యామ్‌.కె.నాయుడు, సమర్పణ: బెల్లంకొండ పద్మావతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X