'గోలీమార్'కి ఆ సినిమాలకీ పోలిక లేదు: పూరీ జగన్నాధ్
ఇది 'అబ్ తక్ చప్పన్' సినిమా అని కొందరంటున్నారు. దయానాయక్ ని ఒక్కొక్కరు ఒక్కోలా చూశారు. ఆయనలో నేను చూసిన కోణం వేరు. అయినా దయానాయక్ జీవితం ప్రేరణతో బాలీవుడ్‌లో 'అబ్ తక్ చప్పన్', తెలుగులో 'సిద్ధం' వంటివి వచ్చివుండొచ్చు. అయినా నా విజన్ నాదే. నా 'గోలీమార్'కీ, ఆ సినిమాలకీ పోలికంటూ ఏమీ లేదు అని స్పష్టం చేస్తున్నారు పూరి జగన్నాథ్. గోపీచంద్, ప్రియమణి కాంబినేషన్లో 'గోలీమార్' చిత్రాన్ని శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేశ్ నిర్మించారు. ఈ చిత్రం ప్రమేషన్ లో భాగంలో పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ పై విధంగా స్పందిచారు.
అలాగే "నా గత మూడు చిత్రాలు సరైన విజయం సాధించలేదు. 'గోలీమార్'తో మంచి విజయం దక్కింది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందనుకున్నాను. అందుకు తగ్గ ఫలితమే దక్కింది. నా సినిమాల్లో మాటలు తూటాల్లా పేలతాయి. ఈ సినిమాలో తూటాలే ఎక్కువ పేలాయి. కొన్ని సినిమాలకే పదునైన సంభాషణలు రాయడం వీలవుతుంది. ఈ సినిమాకు అనవసరంగా ఒక్క మాట కూడా ఎక్కువ రాయలేదు. ప్రేక్షకులు ఆశిస్తారని ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ లు పెట్టడానికి ప్రయత్నించలేదు అన్నారు.


Click it and Unblock the Notifications











