ఇంద్రగంటి మోహన్ కృష్ణ 'గోల్కొండ హైస్కూల్‌' గురించి

By Srikanya

'అష్టాచమ్మా' తో దర్శకుడుగా తన సత్తా ఏమిటో ప్రూవ్ చేసుకున్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ తాజాగా 'గోల్కొండ హైస్కూల్‌' అనే చిత్రం డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం కథ క్రికెట్ ఆట నేఫద్యంలో జరుగుతుంది. సుమంత్‌ హీరోగా చేస్తున్న చిత్రంలో కలర్స్ స్వాతి హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రం టైటిల్ కి ఆటలు మా హక్కు అని ట్యాగ్ లైన్ పెట్టారు.

పి.రామ్మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సందర్బంగా చిత్ర సమర్పకులు సురేష్‌బాబు మాట్లాడుతూ ..ఈ సినిమా నాకు బాగా నచ్చింది. పాఠశాలకు ఆటస్థలం ఎంత ముఖ్యమో ఈ సినిమా చూశాకా ప్రతి ఒక్కరికి తెలుస్తుందని అన్నారు.

ఆ తర్వాత హీరో సుమంత్‌ మాట్లాడుతూ '' నా జీవితంలో మళ్లీ ఇలాంటి పాత్ర రాదు. ఈ సినిమా కోసం కొంత మంది హీరోల్ని సంప్రదించారు. వాళ్లు అంగీకరించలేదు. ఈ సినిమా చూశాకా నటించలేనందుకు వారు బాధపడతారు. బాలీవుడ్‌లో 'లగాన్', 'చక్‌దే' సినిమాల తర్వాత అక్కడి ట్రెండ్ ఎలా మారిందో ఈ సినిమా తర్వాత తెలుగు చిత్రపరిశ్రమలో కూడా మార్పు వస్తుందని చెప్పారు. స్కూల్లో జరిగే క్రికెట్‌ టోర్నమెంటు నేపథ్యంగా జరిగే కథ ఇది. హరిమోహన్‌ పరువు రచించిన 'ది మెన్‌ విత్‌ఇన్‌' నవల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సుబ్బరాజు, షఫీ, రవిప్రకాశ్‌, ఝాన్సీ, హేమలతోపాటు కొంతమంది పాఠశాల విద్యార్థులూ నటించారు. కెమెరా: సెంథిల్‌కుమార్‌, సంగీతం: కల్యాణి మాలిక్‌, పాటలు: సీతారామశాస్త్రి, కళ: రవీందర్‌, కూర్పు: శ్రావణ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X