twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నటుడు గొల్లపూడి ఇకలేరు.. గద్ద ముక్కు పంతులు అంటూ ఆలీ భావోద్వేగం

    |

    ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతిరావు ఇకలేరు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. గొల్లపూడికి ముగ్గురు కుమారులు ఉన్నారు. రచయితగా, వ్యాఖ్యాతగా, కాలమిస్టుగా గొల్లపూడి సుపరిచితులు. డాక్టర్ చక్రవర్తి చిత్రానికి ఉత్తమ రచయితగా నంది అవార్డు అందుకొన్నారు. గొల్లపూడి ఇక లేరనే వార్తతో తెలుగు సినీ లోకం విషాదంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా ఆలీ తన అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ..

    గొల్లపూడి గొప్ప రచయిత

    గొల్లపూడి గొప్ప రచయిత

    గొల్లపూడి మారుతీరావు గొప్ప రచయిత. కోడి రామకృష్ణ, ఆయన కాంబినేషన్‌లో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. పుణ్యస్త్రీ అనే చిత్రంలో కొడుకుగా నటించాను. ఆయన గొప్ప నటుడు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకొన్నది. గొల్లపూడితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన లేని లోటు తీరనిది అని ఆలీ చెప్పారు.

    గద్ద ముక్కు పంతులుగా

    గద్ద ముక్కు పంతులుగా

    సినిమా పరంగా ఆయన నటించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా నాకు బాగా నచ్చుతుంది. ఆయన గద్ద ముక్కు పంతులుగా ఆ క్యారెక్టర్‌లో గుర్తుండి పోతారు. ఆ సినిమా తర్వాత ఆయనను గద్ద ముక్కు పంతులు అనే పేరు ఆయనకు నిలిచిపోయింది అని ఆలీ అన్నారు.

    చాలా ఎంకరేజ్ చేసేవారు

    చాలా ఎంకరేజ్ చేసేవారు

    షూటింగ్‌లో సహచర నటులను బాగా ప్రోత్సహించేవారు. ఎవరైనా సరిగా చేయలేకపోతే భుజం మీద చేయి వేసి.. చాలా సింపుల్ అంటూ ఎంకరేజ్ చేసేవారు. నా కెరీర్ ఆరంభంలో నాకు చాలా సలహాలు, సూచనలు ఇచ్చారు. సినిమా పరంగానే కాకుండా వ్యక్తిగతంగా గొల్లపూడితో నాకు మంచి అనుబంధం ఉంది అని ఆలీ భావోద్వేగానికి గురయ్యారు.

    Recommended Video

    CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
    14 ఏళ్లకే రచయితగా

    14 ఏళ్లకే రచయితగా

    ఇక గొల్లపూడి మారుతిరావు విషయానికి వస్తే.. జర్నలిస్టుగా ఆయన కెరీర్‌ను ఆరంభించారు. 14 ఏళ్లకే రచయితగా ఆశాజ్యోతి అనే పుస్తకాన్ని రాయడం గమనార్హం. జీవనకాలం పేరుతో పత్రికల్లో పలు వ్యాసాలు రాశారు. ఆయన పలు రచనలు పలు యూనివర్సిటీలలో పాఠ్యాంశాలుగా బోధిస్తున్నారు.

    English summary
    Tollywood's senior actor and writer Gollapudi Maruti Rao no more. He died with old age related diseases.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X