హిందీ 'గోల్ మాల్ 3'ని కాపీ కొడ్తున్నారా?
బాలీవుడ్లో సంచలన విజయం నమోదు చేసిన గోల్ మాల్ 3 ఇప్పుడు తెలుగులో ప్రీమేక్ కాబోతోందని సమాచారం. రోహిత్ శెట్టి దర్సకత్వంలో రూపొందిన ఆ చిత్రం అక్కడ సంచలన విజయం సాధించింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో రూపొందిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్, అర్షద్ వార్సీ, తుషార్ కపూర్ హీరోలుగా చేసారు. కరీనా కపూర్ హీరోయిన్ గా చేసింది.అయితే ఈ చిత్రం ఇఫ్పుడు రామానాయుడు బ్యానర్ లో నిర్మితమైన 'ముగ్గురు' సినిమాగా మారిందంటున్నారు. కథ కాస్త ఎవేగా వెళ్లినా సీన్స్ మాత్రం ఆ సినిమాలోంచే ఎత్తారని చెప్పుకుంటున్నారు. వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో నవదీప్, రాహుల్, అవసరాల శ్రీనివాస్ హీరోలుగా 'ముగ్గురు' చిత్రం తెరకెక్కుతోంది. జూలై నెలాఖరులో ఆడియోను విడుదల చేసి, ఆగస్ట్ రెండో వారంలో చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











