గోల్‌మాల్ గొడవల్లో వెంకటేష్, రామ్
హైదరాబాద్: అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్ నటించిన బాలీవుడ్ హిట్ మూవీ 'బోల్ బచ్చన్' చిత్రానికి రీమేక్‌గా....వెంకటేష్, రామ్‌లతో 'గోల్ మాల్' చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఫైట్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
చిత్రానికి విజయ్‌భాస్కర్.కె దర్శకత్వం వహిస్తున్నారు. అంజలి, సాజన్ పదమ్‌సీ హీరోయిన్స్. స్రవంతి రవికిషోర్ నిర్మాత. సురేష్‌బాబు సమర్పకులు. ప్రస్తుతం తెలుగులో ఎంటర్టెన్మెంట్ సబ్జెక్టులకే మంచి ఆదరణ ఉన్న నేపత్యంలో ఈచిత్రం తెలుగు బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నారు.
బోల్ బచ్చన్ లో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్, ప్రచీ దేశాయ్, అస్రానీ, అర్చనా పూరణ్‌సింగ్ తదితరులు నటించారు. సంగీతం హిమేష్ రేషిమియా అందించారు. దర్శకుడు రోహిత్‌శెట్టి డైరక్ట్ చేసాయగా, అజయ్ దేవగన్ నిర్మించారు. అయితే ఈ చిత్రం హృషికేశ్ ముఖర్జీ హిట్ 'గోల్ మాల్' (1979) కి రీమేక్ కావటం విశేషం. కామెడీ ఆఫ్ ఎర్రర్స్,పంచ్ డైలాగ్స్ తో ఈ చిత్రం నవ్విస్తూ సాగుతుంది. బాలీవుడ్ లో ఈ చిత్రం మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. అందుకే తెలుగు వెర్షన్ కు గానూ గోల్‌మాల్ అనే టైటిల్ ని పెట్టారు.


Click it and Unblock the Notifications











