గుడ్ సినిమా గ్రూపు సమర్పణలో ‘హృదయ కాలేయం’
హైదరాబాద్ : టాలీవుడ్లో 'హృదయ కాలేయం' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'ఎ కిడ్నీ విత్ హార్ట్' అనే అర్థం పర్థంలేని సబ్ టైటిల్‌తో 'హృదయ కాలేయం' చిత్రం హీరో సంపూర్ణేష్ బాబు తనదైన రీతిలో సోషల్ మీడియాలో సినిమాకు ప్రచారం కల్పిస్తూ...ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
వినూత్నమైన పబ్లిసిటీతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నేపథ్యంలో.....'ఈ రోజుల్లో', విల్లా(పిజ్జా 2) చిత్రాలను విడుదల చేసిన 'గుడ్ సినిమా గ్రూపు' వారు తమ సంస్థ సమర్పణలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టీవెన్ శంకర్ దర్శకుడు. నీలం సాయి రాజేష్ నిర్మాత. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ...'హదయ కాలేయం'...ఎ కిడ్నీ విత్ హార్ట్ టైటిల్ ఎందుకు పెట్టానో సినిమా చూసాక తెలుస్తుంది. తొలుత నేను అనుకున్న కథ తీయడానికి నిర్మాతలు ఎవరూ రాలేదు. ఇంటర్నెట్లో ట్రైలర్స్ పాపులర్ అయ్యాకే కొంత మంది ముందుకు వచ్చారు. ఈ కథ ఎవరూ చేయడానికి ఇష్టపడలేదు. ఓ ఫంక్షన్లో పరిచయమైన సంపూర్ణేష్ బాబు తనంతట తానుగా...మీరెలా చేయమన్నా చేయడానికి సిద్ధమని ముందుకు వచ్చాడు, సినిమా వైరైటీగా ఉంటుంది అని దర్శకుడు తెలిపారు.


Click it and Unblock the Notifications











