ముద్దు పెడితే అదృష్టం ట్రాన్స్ ఫర్ అయ్యే కాన్సెప్ట్ తో ఆ మధ్య హాలివుడ్ రొమాంటిక్ కామిడీ 'జస్ట్ మై లక్' రిలీజైంది.ఈ సినిమాని కాపీ చేస్తూ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'కంత్రి' లో ట్రాక్ పెట్టారు. అయితే ఆ సినిమా వర్కవుట్ కాలేదు. ఇప్పుడదే కథని పూర్తిగా మక్కీకి మక్కీ కాపీ చేస్తూ 'గుడ్ లక్' అనే బాలీవుడ్ సినిమా ఈ వారం రిలీజయింది. ఆదిత్యా దత్తా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బ్లేడ్ బాబ్జీ ఫేమ్ శయాలీ భగత్ హీరోయిన్ గా చేసింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇలా 'జస్ట్ మై లక్' సినిమా రెండు భారతీయ సినిమాలకు బ్యాడ్ లక్ తెచ్చిపెట్టింది.
Story first published: Wednesday, April 22, 2026, 9:48 [IST]