»   »  'లక్' పాప ....

'లక్' పాప ....

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sayali Bhagat
'బ్లేడు బాబ్జీ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్న ముద్దుగుమ్మ శ్రియాలి భగత్. ఈ ముంబాయి భామ ఇప్పటికే హిందీలో 'ది ట్రెయిన్' చిత్రాన్ని చేసి తన అందచందాలను తెరపై ఒలకపోసింది. అంతేగాక 'హల్లాబోల్' సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి అదరకొట్టింది. సినిమా ఆడకపోయినా ఆమెకు మాత్రం హాట్ గర్ల్ అనే పేరు లాగే తెచ్చిపెట్టింది. దాంతో ఆమెకు ఇప్పుడు లక్ తిరిగే ఆఫర్ వచ్చింది. అస ఆమె సినిమాలు ఎక్కువగా రిలీజవకుండానే స్టిల్స్ చూసే ఆఫర్స్ రావటం బాలీవుడ్ ని ఆశ్చర్యపరిచి లక్ పాప అనే అర్ధం వచ్చేటట్లు పిలుస్తున్నారట.

ఇక ఆ సినిమా పేరు 'గుడ్ లక్' .రాజకుమార్ సంతోషి 'ఫ్యామిలీ' సినిమాతో లాంచింగ్ చేసిన ఆర్యన్ ఇందులో హీరో. ఇక ఈ సినిమా 'జస్ట్ మై లక్' అనే హాలీవుడ్ కి కాపీ. దాన్ని దాచిపెట్టి దర్శకుడు ఆదిత్యాదత్ గొప్పలు చెపుతున్నాడు. అయితే ఈ చూసేసిన సినిమాకి ఎందుకెళ్ళాలి అంటే ఈ క్లాస్ కామిడీలోనూ మాస్ ముద్దులు, కౌగిళ్ళు...ఎక్సెట్రా...ఉన్నాయట. అందుకే ఈ సినిమా ఆమెకు లక్ తెచ్చిపెడుతుందని అందరికీ చెప్తోందిట.అయినా బ్లేడు బాబ్జీ సినిమాకీ ఆమె యేమి మొహమాటపడకుండా సహకరించిందని యూనిట్ సభ్యులు గుసగుసలు పోతున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X