నాగార్జున గీతాంజలి ప్రత్యేకతతో...
ఉదయ్, ప్రకృతి జంటగా బోడపాటి విజువల్స్ పతాకంపై మురళీ గంధర్వ దర్శకత్వంలో 'గుడ్‌మార్నింగ్' పేరుతో ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోంది. 'ఎ లవ్‌స్టోరి లైక్ ఫస్ట్ కిస్' అనేది ఈ చిత్రం ఉపశీర్షిక. బోడపాటి చిన్న యోగయ్య సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం విశేషాలను దర్శకుడు తెలియజేస్తూ ' నవ్యమైన ప్రేమకథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంతో సహజంగా వుంటుంది. నేటి యువతరానికి నచ్చే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయన్నారు.
'గీతాంజలి' తర్వాత పొగమంచు నేపథ్యంలో వస్తున్న ప్రేమకథ ఇదే కావడం మా చిత్రానికి వున్న ఆకర్షణ. అరకు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేశాం. షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం వుంది' అన్నారు.
ఉదయ్, ప్రకృతి, ఏఆర్‌సీ బాబు, మణిపావూతుని, డీవీ హేమ, సంగీత, ఆనంత్‌బాబు తదితరులు ముఖ్యపావూతల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రవి కళ్యాణ్, కెమెరా: రమణ మహేష్, పాటలు: మౌన శ్రీ మల్లిక్, నిర్మాణం: బోడపాటి విజువల్స్ యూనిట్, రచన-దర్శకత్వం: మురళీ గంధర్వ, సమర్పణ: బోడపాటి చిన యోగయ్య.


Click it and Unblock the Notifications
