twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ అభిమానులు ఊపిరి పీల్చుకోవచ్చు..అంతా సెట్ చేస్తున్న త్రివిక్రమ్ !

    |

    అభిమానుల్లో ఎన్నో ఆశలు, ట్రేడ్ పండితులో ఎన్నో అంచనాల నడుమ విడుదలైన అజ్ఞాతవాసి చిత్రం డిజాస్టర్ గా మిగిలిపోయింది. అజ్ఞాతవాసి త్రివిక్రమ్ దర్శకత ప్రతిభకే మచ్చ అని క్రిటిక్స్ తేల్చేశారు. అజ్ఞాతవాసి కారణంగా త్రివిక్రమ్ మరియు ఎన్టీఆర్ ల చిత్రం ఆగిపోయిందనే గాసిప్స్ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపించాయి. ఈ వార్తలు ఎన్టీఆర్ అభిమానులని కలవర పెట్టాయి. ఎంత డిజాస్టర్ ఇచ్చినా త్రివిక్రమ్ ప్రతిభకు వంకర్లు పెట్టలేం అని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. తాజాగా అందిన వార్త ఎన్టీఆర్ అభిమానులలో జోష్ పెంచేదిగా ఉంది.

    Recommended Video

    Trivikram Given Clarity About His Film Gossips రూమర్ల పై త్రివిక్రమ్ క్లారిటీ
     ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు

    ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు

    అజ్ఞాతవాసి చిత్రం విడుద్దాలకు ముందే ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్ర పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. అజ్ఞాతవాసి భారీ హిట్ కొడుతుందని, ఆ ఉత్సాహంతో అంతకు మించేలా త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాని తెరకెక్కిస్తాడని సినీవర్గాలు చర్చించుకున్నాయి. కానీ ఫలితం బెడిసికొట్టడంతో త్రివిక్రమ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాని హోల్డ్ లో పెట్టేశాడని వార్తలు జోరందుకున్నాయి.

    అంతా సెట్ చేస్తున్న త్రివిక్రమ్

    అంతా సెట్ చేస్తున్న త్రివిక్రమ్

    సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని తేలిపోయింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ నటీనటుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించాడట. అజ్ఞాతవాసికి సంగీతం అందించిన అనిరుధ్ ఈ చిత్రానికి కూడా సంగీత దర్శకుడు.

    హీరోయిన్ దొరకడం లేదు

    హీరోయిన్ దొరకడం లేదు

    ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్ ఎంపికైందని గతంలో వార్తలు వచ్చాయి. అందులో వాస్తవంలేదని తెలుస్తోంది. కథ పరంగా ఎన్టీఆర్ కు సరియగు జోడీని వెతికే పనిలో త్రివిక్రమ్ ఉన్నాడు. వీలైనంత త్వరలోనే నటీనటుల గురించి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

     అజ్ఞాతవాసి పొరపాటు రిపీట్ కాకుండా..

    అజ్ఞాతవాసి పొరపాటు రిపీట్ కాకుండా..

    అజ్ఞాతవాసి చిత్ర విషయంలో త్రివిక్రమ్ పొరపాటు చేశాడు. అంతగా బలం లేని ప్రెంచ్ కథని తీసుకుని తెలుగువారిని మెప్పించాలనుకోవడం పొరపాటు అని క్రిటిక్స్ అభిప్రాయం పడుతున్నారు. కానీ ఆ తప్పు మరో మారు త్రివిక్రమ్ చేయబోడని తెలుస్తోంది. త్రివిక్రమ్ తన సొంత ఆలోచనలకు పదును పెట్టి తన ఎన్టీఆర్ కోసం సరి కొత్త ప్రేమ కథని తీర్చిదిద్దాడట.

    English summary
    Trivikram Srinivas stars NTR movie casting work. Right now Trivikram is busy selecting appropriate actors for the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X