నాగార్జున అభిమానులకు శుభవార్త
నాగార్జున హీరోగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'డమరుకం'. గత ఆరు నెలలుగా పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉన్న ఈ చిత్రం జూన్ 6 న విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే చిత్రానికి ఓ రేంజిలో బిజినెస్ కూడా జరుగుతున్నట్లు చెప్తున్నారు. ఓవర్ సీస్ రైట్స్ ని హరి వెంకటేశ్వర ఫిల్మ్స్ వారు తీసుకున్నారు. నాగార్జున తొలి సోషియో ఫాంటసీ చిత్రం కావటం,వరస విజయాలతో దూసుకు పోతున్న ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు నిర్మాత కావంట సినిమాకు క్రేజ్ తెచ్చి పెట్టింది.
ఈ చిత్రం గురించి దర్సకుడు మాట్లాడుతూ.. ''నాగార్జున పాత్ర విభిన్నమైన రీతిలో ఉంటుంది. ఆయన తొలిసారి సోషియో ఫాంటసీ తరహా చిత్రంలో నటిస్తున్నారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా గ్రాఫిక్స్ ఉంటాయి. సాంకేతికంగా ఉన్నత స్థాయిలో తెరకెక్కిస్తున్నాము''అని ధర్శకుడు తెలిపారు. చాలా కాలం క్రితం ప్రారంభమైన ఈ చిత్రానికి సంభందించి రీసెంట్ గా రామోజీ ఫిల్మ్‌సిటీలో ముఖ్య సన్నివేశాలు చిత్రించారు. మరో వైపు విజువల్ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన పనులు నడుస్తున్నాయి. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో విజువల్ ఎఫెక్ట్స్ పనులు జరుగుతున్నాయి.
ఢమురుకం చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ శివుడుగా కనిపించనున్నారు. ఇక అనూష్క దైవ శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా మైతిలాజికల్ పాత్రలో కనిపిస్తోంది. రక్త చరిత్రలో చేసిన అభిమన్యు సింగ్ ఇందులో విలన్ గా కనిపించనున్నారు.
ఈ చిత్రం స్టోరీ పాయింట్ గురించి దర్శకుడు శ్రీనివాస రెడ్డి చెబుతూ...గతంలో నేను రూపొందించిన యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో యముడు భూమి మీదకు వస్తాడు. ఇక్కడ శివుడు భూమి మీదకు క్రిందకి దిగి వస్తాడు. అప్పుడు నాగార్జునకీ, హీరోయిన్ కీ, శివుడు కీ మధ్య జరిగే కథనం ఆసక్తి గా ఉంటుంది అన్నారు. ఇక నాగార్జున పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇవివి హలో బ్రదర్ తరహాలో కామిడీ టచ్ తో సాగుతుంది అన్నారు.
ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనుష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకుడు. వెంకట్ నిర్మాత. ప్రకాష్‌రాజ్, గణేష్ వెంకట్రామన్, దేవన్, అవినాష్, బ్రహ్మానందం, కృష్ణభగవాన్, రఘుబాబు, ప్రగతి తదితరులు నటిస్తున్నారు.
సమర్పణ: కె.అచ్చిరెడ్డి,
సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి,
కూర్పు: గౌతమ్‌రాజు,
ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు,
సంగీతం: దేవిశ్రీప్రసాద్.


Click it and Unblock the Notifications











