నేల టికెట్టు సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్!
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రవితేజ తాజా చిత్రం 'నేల టిక్కెట్టు' సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు కళ్యాణ్ కృష్ణ అయితే అసలు ఇతగాడు దర్శకుడిగా పరిచయం కావాల్సింది రవితేజ సినిమాతోనే కాని కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా అప్పుడు కుదరలేదు ఇప్పుడు కుదిరింది.
ఈ సినిమాలో జగపతిబాబు, బ్రహ్మానందం, అలీ, పోసాని, ప్రియదర్శి, జయప్రకాష్, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఫిదా ఫేం శక్తికాంత్ ఈ మూవీకి స్వరాలు అందించారు. ఆయన సమకూర్చిన అన్ని పాటలకు మంచి స్పందన లభించింది. మూవీ రవితేజ శైలిలో వినోదభరితంగా ఉండబోతోందని సమాచారం.

'నేల టిక్కెట్టుగాళ్లతో పెట్టుకుంటే.. నేల నాకించేస్తారు' వంటి మరెన్నో విజిల్స్ కొట్టించే డైలాగ్స్ ఈ సినిమాలో మరిన్ని ఉండబోతున్నాయని సమాచారం. రేపు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై పాజిటివ్ బజ్ ఉంది. సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బుక్ మై షో లో నేల టికెట్టు సినిమాకు మంచి రెస్పాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications











