twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మధ్యలో ఆ ఒక్కటి..: 'అజ్ఞాతవాసి'.. అంత దారుణంలో కాస్త ఊరటగా!, కానీ?

    |

    'అజ్ఞాతవాసి' ఇక టపా కట్టేసినట్లే అనేది నిర్దారణ అయిపోయింది. అభిమానులు సైతం ఏమాత్రం మొహమాటం లేకుండా సినిమా 'అత్యంత దారుణం' అని తేల్చేశారు. జరగాల్సిన పోస్ట్ మార్టమ్ కూడా జరిగిపోయింది. ఒకటీ అరా సన్నివేశాలు తప్పితే.. సినిమా మొత్తంలో ప్రేక్షకుడు ప్రతిస్పందించేలా చేసిన సీన్స్ అసలు లేవనే చెప్పాలి. అయితే ఆ ఒకటీ అరాలో విలన్ ఆది పినిశెట్టి సీన్ ఒకటి ఉండటం విశేషం.

    Recommended Video

    'అజ్ఞాతవాసి'పై ఓ అభిమాని ఆవేదన చుడండి !
     పవన్ ఇంట్రో తర్వాత.. ఆ ఒక్కటే!:

    పవన్ ఇంట్రో తర్వాత.. ఆ ఒక్కటే!:

    'అజ్ఞాతవాసి' సినిమాలో పవన్ కల్యాణ్ ఇంట్రో అంతగా ఆకట్టుకోలేదని అభిమానులే చెబుతున్నారు. అయితే మిగతా సీన్స్ తో పోలిస్తే ఆ ఇంట్రో బాగుందనేది మరికొందరి అభిప్రాయం. అంతో.. ఇంతో.. ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపిన ఆ సీన్ తర్వాత.. అంతా ఉసూరుమనిపించే సన్నివేశాలే. అయితే మధ్యలో ఆది పినిశెట్టి ఎంట్రీ ఒకటి కాస్త ఊరట.

    ఆది 'ఇంట్రో'కు మంచి రెస్పాన్స్:

    ఆది 'ఇంట్రో'కు మంచి రెస్పాన్స్:

    అజ్ఞాతవాసిలో విలన్ ఆది పినిశెట్టి ఎంట్రీ సీన్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఆ సీన్ వచ్చేటప్పుడు ప్రేక్షకుల నుంచి విజిల్స్, కేకలు బాగానే వినిపించాయి. అయితే ఆ ఊపు కూడా ఎంతోసేపు నిలవనివ్వలేదు దర్శకుడు త్రివిక్రమ్.

    సో.. సో.. :

    సో.. సో.. :

    ఆది పినిశెట్టి ఎంట్రీ సీన్ లో ఉన్నంత జోష్ ఆ తర్వాత భూతద్దం పెట్టి వెతికినా మళ్లీ ఎక్కడ కనిపించలేదు. అన్నీ పాత్రల్లాగే ఆ పాత్రను కూడా సో.. సో.. అనే రీతిలో డెవలప్ చేసుకొచ్చాడు త్రివిక్రమ్.

    త్రివిక్రమ్‌పై విమర్శలు:

    త్రివిక్రమ్‌పై విమర్శలు:

    పవన్ కల్యాణ్ నటనపై కూడా విమర్శలు వచ్చేలా ఆ క్యారెక్టర్ డిజైన్ చేశాడు త్రివిక్రమ్. ఆడవాళ్లను ఇమిటేట్ చేసినట్లు పవన్ నటించే సన్నివేశాలు కూడా ఎబ్బెట్టుగా కనిపించాయి. స్క్రిప్టు రాసుకునేటప్పుడే.. క్యారెక్టరైజేషన్స్‌పై జాగ్రత్త తీసుకోకపోవడంతో అన్ని పాత్రలు తేలిపోయాని అంటున్నారు.

    మాయని మచ్చ:

    మాయని మచ్చ:

    మొత్తంగా త్రివిక్రమ్-పవన్ కల్యాణ్ కెరీర్‌లో 'అజ్ఞాతవాసి' ఓ మాయని మచ్చగా మిగిలిపోయిందనే చెప్పాలి. అంచనాలు పూర్తిగా తలకిందులైన వేళ.. త్రివిక్రమ్ తమను తలెత్తుకోకుండా చేశాడని పవన్ అభిమానులు వాపోతున్న పరిస్థితి. ఏదేమైనా సినిమా అన్నాక.. హిట్-ఫ్లాప్ ఎంత సహజమో.. విమర్శలూ కామనే. కాబట్టి త్రివిక్రమ్‌కు కొన్నాళ్లు పవన్ అభిమానుల నుంచి విమర్శలు తప్పకపోవచ్చు.

    English summary
    After Pawan Kalyan introduction scene there is no such element in Agnyaathavasi movie, But Adi Pinishetty intro also got some what better response.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X