పవన్ '.. రాంబాబు' ఆడియో రివ్యూ

By Srikanya

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'. ఈచిత్రం ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం ఉదయం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సాదీ సీదాగా నిర్వహించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో సీడీలను మార్కెట్‌లోకి విడుదల చేసారు. మణిశర్మ స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు అభిమానులును బాగా అలరిస్తున్నాయని సమాచారం. చిత్రంలోని పాటలను భాస్కరభట్ల సింగిల్ కార్డుతో రాసారు.

పాటల్లో మొదట ధీమ్ సాంగ్..

రాంబాబు ఎలాంటివాడో వర్ణిస్తూ సాగే ఈ పాటను హేమ చంద్ర,కారుణ్య,నరేంద్ర పాడారు. పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఈ పాట రూపొందింది. హిందీ, ఇంగ్లీష్ పాదల క్లబ్ గా ఈ పాట రూపొందింది. ఈ ఆల్బమ్ లో హై ఓల్టేజి సాంగ్ ఇది. అందరూ ముక్తకంఠంతో సూపర్బ్ అంటున్నారు.

రెండో పాట : పిల్లని చూస్తే...

కారణ్య, చైత్ర పాడిన ఈ పాట పూర్తిగా సరదాగా సాగుతుంది. లవర్స్ మధ్య సాగే ఈ పాట చాలా సాఫీగా సాగుతుంది. రొమాన్స్ మూడ్ ని క్రియేట్ చేస్తుంది.

మూడవ పాట : జ్వరమెచ్చింది..

శ్రవణ బార్గవి, మురళి పాడిన ఈ పాట మాస్ కోసం రెడీ చేసిన ఐటం సాంగ్ ...గ్యారెంటీగా ధియోటర్స్ లో జనం లేచి డాన్స్ చేస్తారంటున్నారు.

నాలుగవ పాట:ఎక్టట్రార్డనరీ

హేమచంద్ర పాడిన పాట చాలా ఎక్సటార్డనరీగా ఉందంటున్నారు. ఈ పాట ఖచ్చితంగా హేమచంద్రను మోస్ట్ వాంటెండ్ సింగర్ గా మారుస్తుందంటున్నారు.

ఐదవ పాట: తలదించుకు బ్రతుకుతావా

ఈ పాట అందరి నోట్లో ఇప్పటికే నానుతోంది. కేవలం బ్రేక్ పాస్ట్,బెడ్ కోసం బ్రతికే వారిని నిలదీసినట్లుందని అంటున్నారు. సమాజాన్ని,బద్దకంగా ఉండే పౌరుల్ని సూటిగా ప్రశ్నించే ఈ పాటను రాసిన భాస్కరభట్ల ప్రతిభను చాలా మంది మెచ్చుకుంటున్నారు. కారణ్య,హేమ చంద్ర,శ్రీ కృష్ణ,నరేంద్ర ఈ పాటను పాడారు.

ఆరవ పాట: మెలికలు తిరుగుతూంటే...

నరేంద్ర,గీతా మాధురి పాడిన ఈ పాట చాలా ఉషారుగా సాగుతూ ప్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది.

ఓవరాల్ గా ఈ పాటలు పవన్ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని స్వరపరిచారని అర్దమవుతుంది. రొమాంటిక్ మెలోడి సాంగ్ కూడ ఒకటి ఉంటే బాగుండేదని సంగీతాభిమాలు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X