నేలటికెట్ పాటలకు మంచి స్పందన!
ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రవితేజ నటిస్తోన్న సినిమా నేలటికెట్. ఇటీవల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి స్పందన లభిస్తోంది. సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం' వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
రాజా ది గ్రేట్‌తో మంచి సక్సెస్ సాధించిన మాస్ మహారాజా 'రవితేజ' నేలటికెట్ సినిమాతో మరోసారి తన సత్తా చూపించబోతున్నాడని తెలుస్తోంది. జగపతిబాబు కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రంలో రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది.

ఈ చిత్రంలో రవితేజ, మాళవిక శర్మ మధ్య సాగే లవ్ స్టోరీ ఆకట్టుకునే విధంగా ఉండబోతోంది. బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉండబోతోందని సమాచారం.


Click it and Unblock the Notifications











