నిజంగా జరిగిన కథే, మేకింగ్ సూపర్‌గా ఉంది : 80ల నాటి లవ్ స్టోరీతో శివబాలాజీ

సెకండ్ హీరోగా చేసిన చేసిన ఆర్య, స్ట్రైట్ హీరోగా చేసిన "ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ" సినిమాల కంటే ఎక్కువ గుర్తింపు మొన్న వచ్చిన బిగ్ బాస్ షో తో వచ్చింది.

Recommended Video

మేకింగ్ సూపర్‌.. 80ల నాటి లవ్ స్టోరీతో శివబాలాజీ

సెకండ్ హీరోగా చేసిన చేసిన ఆర్య, స్ట్రైట్ హీరోగా చేసిన "ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ" సినిమాల కంటే ఎక్కువ గుర్తింపు మొన్న వచ్చిన బిగ్ బాస్ షో తో వచ్చింది. బిగ్ బాస్ సీజన్‌ 1తో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన శివాబాలాజీ నిర్మాత‌గా మారి వెండితెర ప్రేక్ష‌కుల‌ను మెప్పించేందుకు సిద్ధ‌మవుతున్నాడు. కాట‌మ‌రాయుడులో ప‌వ‌న్ క‌ల్యాణ్ సోద‌రుడిగా న‌టించిన శివ‌బాలాజీ ఓ మ‌ల్టీ స్టార‌ర్ తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.

 రాజీవ్ క‌న‌కాల‌, శివ‌బాలాజీ

రాజీవ్ క‌న‌కాల‌, శివ‌బాలాజీ

రాజీవ్ క‌న‌కాల‌, శివ‌బాలాజీలు హీరోలుగా న‌టించిన సినిమా "స్నేహ‌మేరా జీవితం". ఈ సినిమా త్వరలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైల‌ర్ ను దుబాయ్ లో జరిగిన ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో శుక్ర‌వారం విడుద‌ల చేశారు. వేవ్ రెజొనెంట్స్ ఈవెంట్స్ 10వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా జరిగిన కార్య‌క్రమంలో ఆ ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు.

కొన్ని నెలల కిందటే

కొన్ని నెలల కిందటే

ఓ దశలో అతడికి అవకాశాలే లేకుండా పోయాయి. ఐతే ఆ సమయంలోనే సొంతంగా నిర్మాతగా మారి ‘స్నేహమేరా జీవితం' అనే సినిమా మొదలుపెట్టాడు శివబాలాజీ. ఈ సినిమా కొన్ని నెలల కిందటే పూర్తయింది కూడా. కానీ ఇటు ప్రేక్షకుల్లో కానీ.. అటు ట్రేడ్ వర్గాల్లో ఎలాంటి స్పందనా కనిపించలేదు అప్పుడు.

యధార్థ ఘటన ఆధారంగా

యధార్థ ఘటన ఆధారంగా

1980 బ్యాక్‌డ్రాప్‌లో ఒక యధార్థ ఘటనని ఆధారంగా చేసుకుని ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథే ఈ సినిమా. ఈ సినిమాలో శివబాలాజీతో పాటు ప్రముఖ నటుడు రాజీవ్ క‌న‌కాల కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. శివ‌బాలాజీ స‌ర‌స‌న యు.ఎస్‌కు చెందిన తెలుగు అమ్మాయి, క్లాసిక‌ల్ డ్యాన్సర్ సుష్మ యార్ల‌గ‌డ్డ హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతోంది.

"బిగ్ బాస్" షోలో పాల్గొన్నాడు

ఈ నెల‌లోనే సినిమా చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్త‌వుతుంద‌ని, సునీల్ కశ్యప్ అద్భుతమైన సంగీతం, భరణి కె.ధరణ్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్‌‌గా నిలుస్తాయని దర్శక నిర్మాతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. కట్ చేస్తే.. శివబాలాజీ ‘బిగ్ బాస్' షోలో పాల్గొన్నాడు. అందులో విజేత కూడా అయ్యాడు.

 ట్రైలర్ సోషల్ మీడియాలో

ట్రైలర్ సోషల్ మీడియాలో

ఇప్పుడు అతడికి ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పుడు సరైన టైమింగ్ చూసి ‘స్నేహమేరా జీవితం' ట్రైలర్ లాంచ్ చేశాడు శివబాలాజీ. ఈ మధ్య రిలీజైన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో బాగానే చర్చనీయాంశమవుతోంది. 1982 నాటి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కడం విశేషం. శివబాలాజీతో పాటు రాజీవ్ కనకాల హీరోలుగా నటించారిందులో.

80ల నాటి నేటివిటీ

80ల నాటి నేటివిటీ

వీళ్లిద్దరి లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. వారి పాత్రలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. లవ్.. యాక్షన్.. కామెడీ అన్నీ కలగలిసిన సినిమాలా ఉంది. 80ల నాటి నేటివిటీని బాగానే చూపించినట్లున్నారు. సినిమాపై కొంచెం ఎక్కువే ఖర్చు పెట్టినట్లున్నాడు శివబాలాజీ. ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయాలని శివబాలాజీ ప్లాన్ చేస్తున్నాడు. ట్రైలర్ చూశాక ఈ సినిమాకు మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తాయని అతను ఆశిస్తున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X