గూఢచారి ట్విట్టర్ రివ్యూ: అడవి శేష్ అదరగొట్టాడు
Recommended Video

క్యారెక్టర్ రోల్స్ తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అడవి శేష్ ఒక్కో చిత్రంతో తన సత్తా చాటుకుంటూ వచ్చాడు. హీరోగా నటించిన క్షణం చిత్రం అడవి శేష్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఇప్పటికి అడవి శేష్ ని చిన్న హీరోగానే పరిగణించాలి. గూఢచారి చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ టీజర్ ట్రైలర్ విడుదలయ్యాక ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. సినిమాపై అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. యాక్షన్ ప్రియులంతా ఈ చిత్రం కోసం ఎదురుచూసారు. ఆ రోజు రానే వచ్చింది. గూఢచారి చిత్రం నేడు ప్రేక్షకులముందుకు రాబోతోంది. శశి కిరణ్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా శోభిత ధూళిపాళ హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించారు. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ప్రీమియర్ షో రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
ఇలాంటి సినిమా కోసమే
ఇన్ని రోజులుగా ఇలాంటి సినిమా కోసమే ఎదురుచూస్తున్నాను. చిన్న చిన్న లోపాలు ఉన్నా సినిమా అద్భుతంగా ఉంది.
బ్రిలియంట్
అద్భుతమైన కథతో బ్రిలియంట్ పెర్ఫామెన్స్ అందించారు. గూఢచారి చిత్రం కచ్చితంగా సూపర్ హిట్. అడవి శేష్ నటుడిగా, రచయితగా సత్తా చాటిన చిత్రం ఇది.
తెలుగు సినిమా గరించేలా
అడవి శేష్ తెలుగు సినిమా గర్వించే చిత్రాన్ని అందించాడు. స్క్రీన్ ప్లే అదిరిపోయింది. టెక్నీకల్ వాల్యూస్ బావున్నాయి.
ఉత్కంఠ కలిగించేలా
చిత్రంలో ఉత్కంఠ సన్నివేశాల్లో సీట్లలో కూర్చోలేరు. అంత అద్భుతంగా సినిమా ఉంది.
ఇండియన్ సినిమాలోనే
ఇండియన్ స్పైథ్రిల్లర్ మూవీస్ లో గూఢచారి బెస్ట్ మూవీ. సినిమాలో ప్రతి విభాగం అద్భుతం చేసింది.
యూఎస్ నుంచి
గూఢచారి చిత్రానికి యూఎస్ నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.
యావరేజ్ ఫస్ట్ హాఫ్
ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉంది. సెకండ్ హాఫ్ బావుంది.
గరుడ వేగ కంటే
గూఢచారి చిత్రం గరుడవేగ కంటే బావుంది. సెకండ్ హాఫ్ లో లోపాలు ఉన్నప్పటికీ బ్యాలెన్స్ చేశారు.
బయటకు రాలేకున్నా
గూఢచారి చిత్రం చూశాక ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు రాలేకున్నా. తెలుగు సినిమా విజయాలు కొనసాగుతున్నాయి.
రెండు సినిమాలకు
గూఢచారి, చిలసౌ రెండు చిత్రాలకు మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











