Google 2024 search trends: ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Google 2024 search trends: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఈ ఏడాది భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసిన అంశాలను విడుదల చేసింది. 2024 సంవత్సరంలో ఎవరెవరు ఏం వెతికారు? ఏ ఏ అంశాలు గురించి సెర్చ్ చేశారనే విషయాలు గూగుల్ వెల్లడించింది. ఈ క్రమంలో భారతీయులు ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్-10 షో లిస్ట్‌ను తాజాగా విడుదల చేసింది.
2024లో భారతదేశంలో Googleలో అత్యధికంగా సెర్చ్ చేయబడిన టాప్ 10టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
1. హీరమండి (Heeramandi): ఇటీవల ఓటీటీల్లో అదరగొడుతోన్న సిరీస్ లలో హీరమండి: ది డైమండ్ బజార్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ సిరీస్ కు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలి దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో భారీ వ్యూస్ సొంత చేసుకుంది.

2. మీర్జాపూర్ (Mirzapur): క్రైమ్ రివేంజ్ థ్రిల్లర్ డ్రామా సిరీస్ 3వ సీజన్ రెండవస్థానంలో నిలిచింది. మీర్జాపూర్ తొలి రెండు సీజన్లు కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి. మీర్జాపూర్ మూడో సీజన్ జూలై 5వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సీరిస్ లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేత త్రిపాఠి శర్మ, రసిక దుగ్గల్, విజయ్ వర్మ, హర్షిత గౌర్, ప్రియాన్షు పైన్యులి, రాజేశ్ తైలగ్, ఇషా తల్వార్ ప్రధాన పాత్రల్లో నటించించారు.
3. లాస్ట్ ఆఫ్ ఆస్(Last Of Us): డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అత్యధిక వీక్షణలు పొందిన 'ది లాస్ట్ ఆఫ్ యుఎస్' వెబ్ సిరీస్ మూడవ స్థానంలో నిలిచింది. ఈ వెబ్ సిరీస్‌లో పెడ్రో పాస్కల్, బెల్లా రామ్‌సే, గాబ్రియేల్ లూనా, అన్నా టోర్వ్, నికో పార్కర్, ముర్రే బార్ట్‌లెట్, నిక్ ఆఫర్‌మాన్‌తో సహా తదితరులు నటించారు.
4. బిగ్ బాస్ 17 (Bigg Boss 17): కండాల వీరుడు, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియల్టీ షో బిగ్ బాస్. రియాలిటీ షో బిగ్ బాస్ 17 సీజన్ 4 స్తానంలో నిలిచింది. ఈ సీజన్ జనవరి 28 న జరిగిన గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. ఈసారి కమెడియన్, ర్యాపర్ అయిన మునావర్ ఫరూఖీ టైటిల్ గెలుచుకున్నాడు. అభిషేక్ కుమార్ తో పోటీ పడిన మునావర్ టైటిల్ విన్నర్ గా నిలిచారు.

5. పంచాయత్ (Panchayat): లాక్‌డౌన్ నేపథ్యంలో రూపొందించబడిన పంచాయత్ 5 వ స్థానంలో నిలిచింది. ఇందులో జితేంద్ర కుమార్, రఘుబీర్ యాదవ్, నీనా గుప్తా ప్రధాన పాత్రల్లో నటించగా.. సీరిస్ కు దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహించారు. అనురాగ్ సైకియా సంగీతం అందించగా.. అమితాబ్ సింగ్ సినిమాటోగ్రఫీ అందించారు.
6. క్వీన్ ఆప్ టీర్స్ (Queen of Tears): సౌత్ కొరియన్ టీవీ క్వీన్ ఆఫ్ టీర్స్ 6 వ స్థానంలో నిలిచింది. 2024లో స్రీమింగ్ అవుతున్న సౌత్ కొరియన్ టీవీ సిరీస్ ల్లో ఇది ఒకటి. క్వీన్స్ గ్రూప్ అనే పెద్ద సంస్థకు వారసురాలు హాంగ్ హే-ఇన్. ధనవంతురాలు అయిన అమ్మాయి. బేక్ హ్యూన్-వూ పేద యువకుడు మధ్య ప్రేమ కథ ఇది. వారు తమ ప్రేమను నిలబెట్టుకోవడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ తరువాత 7వ స్థానంలో మ్యారీ మై హాస్బెండ్ (Marry My Husband), 8 వ స్థానంలో కోటా ఫ్యాక్టరీ (Kota Factory), 9వ స్థానంలో బిగ్ బాస్ 18 ( Bigg Boss 18) చివరిగా 10 స్థానంలో 3 బాడీ ప్రాబ్లెమ్ (3 Body Problem) నిలిచాయి.
ఇక 2023లో అత్యధికంగా శోధించిన వెబ్ సిరీస్‌లు
1. ఫెర్గీ
2. వెన్స్‌డే
3. అసుర్
4. రానా నాయుడు
5. ది లాస్ట్ ఆఫ్ అజ్
6. స్కామ్ 2003
7. బిగ్ బాస్ 17
8. గన్స్ అండ్ గులాబ్స్
9. సెక్స్/లైఫ్
10. తాజా ఖబర్


Click it and Unblock the Notifications










