అమీర్ ఖాన్ రిక్వెస్ట్‌ను తిరస్కరించిన గూగుల్
ముంబై: అమీర్ ఖాన్, రాణి ముఖర్జీ, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం 'తలాష్'. ఈ చిత్రం నవంబర్ 30న విడుదలకు సిద్ధం అవుతోంది. రీమా కాగ్టి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని రితేష్ సిద్వాని, అమీర్ ఖాన్, ఫరాన్ అక్తర్ సంయుక్తంగా నిర్మించారు.
ఈ సినిమాకు వినూత్నమైన ప్రచారం కల్పించడానికి హీరో అమీర్ ఖాన్ కు సరికొత్త ఐడియా వచ్చింది. హిందీలో 'తలాష్' అంటే 'search'(వెతుకు) అని అర్థం. దీంతో ప్రపంచంలోని అతి పెద్ద సెర్చ్ ఇంజన్ అయిన 'గూగుల్' వైపు మళ్లింది అమీర్ ఖాన్ దృష్టి. ఆ ఆలోచన వచ్చిందే ఆలస్యం... ఇండియాలోని గూగుల్ ఆఫీసుకు దర్శక నిర్మాతలతో కలిసి వెళ్లి...... గుగూల్ హోం పేజీలో 'google search' అనే పదానికి బదులు 'google Talaash' అని పెట్టాలని, అందుకోసం ఎంతైనా చెల్లించడానికి తాము సిద్ధమని కోరాడట. అయితే ఇలాంటి చర్యల వల్ల తమ ప్రతిష్ట దెబ్బ తింటుందనే కారణంతో గూగుల్ సంస్థ అమీర్ ఖాన్ ప్రతిపాదనను తిరస్కరించింది.
ఈ 45 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 'తలాష్‌ని విడుదల చేయడానికి రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ 90 కోట్ల రూపాయలు ఆఫర్ చేసి హక్కులు పొందింది. ఇదికాక శాటిలైట్ హక్కుల వల్ల 40 కోట్లు లభించాయి ఈ చిత్రానికి. ఆరుషి హత్యకేసు ఆధారంగా 'తలాష్' రూపొందిందని వచ్చిన వార్తలను దర్శకురాలు ఖండించారు. తాము స్వయంగా అల్లుకున్న కథ అని స్పష్టంగా ప్రకటించింది.
సినిమా కథ విషయానికొస్తే.... రోషిణి(రాణి ముఖర్జీ)తో షెఖావత్(అమీర్ ఖాన్)కి వివాహం అయ్యాక కొంతకాలానికి ఆ బంధం తెగిపోతుంది. రోషిణి సమాజ సేవిక అవుతుంది. పోలీస్ ఆఫీసర్‌గా కొన్ని కేసుల పరిశోధనలో వేశ్య రోసీ(కరీనా కపూర్)తో షెఖావత్‌కి పరిచయం ఏర్పడుతుంది. ఆ తరువాత ప్రారంభమైన వెదుకులాటతో ముగ్గురి జీవితాల్లోను జరిగే సంఘటనలే సస్పెన్స్ థ్రిల్లర్‌ని చేస్తాయి.. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, కథ: రీమా కాగ్టి, జోయా అక్తర్, సంగీతం: రామ్ సంపత్, సినిమాటోగ్రఫీ: మోహన్, ఎడిటింగ్: ఆనంద్ సుబ్బయ్య.


Click it and Unblock the Notifications











